
యొకోహామా: భారత నంబర్‌వన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు సత్యన్ ప్రపంచకప్ టీటీకి అర్హత సంపాదించాడు. ఇక్కడ జరిగిన ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఆసియా కప్‌లో అతను ఆరో స్థానం పొందడం ద్వారా ప్రపంచకప్ బెర్త్ లభించింది. ఆదివారం ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో 26 ఏళ్ల సత్యన్ 4–11, 8–11, 8–11, 12–14తో చైనీస్ తైపీకి చెందిన లిన్ యున్ జు చేతిలో పరాజయం చవిచూశాడు. అయితే ఈ ఓటమి అతని అవకాశాలను దెబ్బ తీయలేదు. ప్రపంచ 28వ ర్యాంకర్ అయిన సత్యన్ టోర్నీలో మెరుగైన స్థానం (టాప్–6)తో ఈ ఏడాది చైనాలో జరిగే మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాడు. ఈ టోర్నీ అక్టోబర్ 18 నుంచి 20 వరకు చెంగ్డూలో జరుగుతుంది.