స్వియాటెక్‌కు షాక్‌.. వరుసగా 16వ విజయం | Four-time Champion Iga Swiatek Knocked Out Of French Open Fourth Round | Sakshi
Sakshi News home page

French Open 2026: స్వియాటెక్‌కు షాక్‌.. వరుసగా 16వ విజయం

May 31 2026 7:12 PM | Updated on May 31 2026 8:02 PM

Four-time Champion Iga Swiatek Knocked Out Of French Open Fourth Round

ఫ్రెంచ్ ఓపెన్‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. నాలుగుసార్లు చాంపియ‌న్‌, మాజీ నంబ‌ర్‌వ‌న్ ఇగా స్వియాటెక్ ప్రిక్వార్ట‌ర్స్‌లో ఇంటిబాట ప‌ట్టింది. ఆదివారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన‌ 15వ ర్యాంక‌ర్ మార్తా కొస్త్యుక్ చేతిలో 7-5, 6-1తో స్వియాటెక్ ఓట‌మి పాలైంది. 

గంటా 39 నిమిషాల పాటు సాగిన పోరులో కొస్త్యుక్ 5 ఏస్‌లు సంధించ‌గా.. స్వియాటెక్ సున్నా ఏస్‌ల‌కు ప‌రిమిత‌మైంది. కొస్త్యుక్ 25 విన్న‌ర్లు సంధించ‌గా, స్వియాటెక్ కేవ‌లం 13 విన్న‌ర్ల‌కే ప‌రిమిత‌మైంది. గ‌తంలో త‌ల‌ప‌డిన మూడుసార్లు ఓట‌మి పాలైన కొస్త్యుక్ ఈసారి మాత్రం స్వియాటెక్‌పై పైచేయి సాధించింది. స్వియాటెక్‌ను ఎదుర్కొనే క్ర‌మంలో కొస్త్యుక్ గ్రౌండ్ న‌లుమూలలా షాట్లు ఆడింది. 

ముఖ్యంగా మ్యాచ్‌లో కొస్త్యుక్‌ గ్రౌండ్ స్ట్రోక్ విన్నర్స్‌తో అల‌రించింది. అయితే క్లే కోర్టుపై కొస్త్యుక్ త‌న రికార్డును మ‌రింత మెరుగుపరుచుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు క్లే కోర్టులో కొస్త్యుక్ వ‌రుస‌గా 16వ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. కాగా ప్రెంచ్ ఓపెన్‌కు ముందు ఫ్రాన్స్‌లో క్లే కోర్టులో టైటిల్ నెగ్గిన కొస్త్యుక్ ఆ త‌ర్వాత మాడ్రిడ్ టోర్నీ కూడా గెలుచుకుంది. 

మరోవైపు 2024 ఫ్రెంచ్ ఓపెన్ త‌ర్వాత స్వియాటెక్ క్లే కోర్టులో మ‌రో టైటిల్ గెల‌వ‌లేదు. జూన్ 2న జ‌ర‌గ‌నున్న క్వార్ట‌ర్ ఫైన‌ల్లో కొస్త్యుక్ ఏడో ర్యాంక‌ర్ ఎలీనా స్వితోలినాను ఎదుర్కోనుంది.

చదవండి: పాక్ మాజీ కెప్టెన్‌కు అవమానం..

Advertisement
 
Advertisement
Advertisement