T20 WC 2024: అభిమానులకు గుడ్‌న్యూస్‌! | Good News For Fans! Watch T20 WC 2024 In Mobile For Free - Sakshi
Sakshi News home page

T20 WC 2024: అభిమానులకు గుడ్‌న్యూస్‌!

Published Tue, Mar 5 2024 2:02 PM | Last Updated on Tue, Mar 5 2024 2:56 PM

Good News For Fans HowTo Watch T20 WC 2024 All Matches In Mobile For Free - Sakshi

క్రికెట్‌ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త! టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే లక్కీ ఛాన్స్‌..!! ఈ మెగా ఈవెంట్‌ ప్రసారకర్త డిస్నీ+హాట్‌స్టార్‌ తమ డిజిటల్‌ ప్రేక్షకులకు ఈ అవకాశం కల్పించనుంది.

కాగా ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్‌ ప్రపంచకప్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్‌ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్‌లో మొత్తం 55 టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో డిస్నీ+హాట్‌స్టార్‌ సోమవారం కీలక ప్రకటన చేసింది. తమకున్న మొబైల్‌ యూజర్లు వరల్డ్‌కప్‌-2024 మ్యాచ్‌లన్నింటినీ ఫ్రీగా చూడవచ్చని తెలిపింది.  

కాగా గతంలో ఆసియా వన్డే కప్‌-2023, వన్డే వరల్డ్‌కప్‌-2023 మ్యాచ్‌లను కూడా డిస్నీ తమ డిజిటల్‌ యూజర్ల కోసం ఉచితంగా ప్రసారం చేసింది. అదండీ సంగతి.. మీకు గనుక డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటే ఉచితంగా మ్యాచ్‌లు చూసేయొచ్చు! 

కాగా జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా ఈ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ఆరంభించనుంది. అన్నట్లు టోర్నీకే హైలైట్‌గా భావించే భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ జూన్‌ 9న జరుగనుంది. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌ సమరం కంటే ముందు.. మరో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ టీ20 మజాను అందించనుంది. ఈ మ్యాచ్‌లను కూడా జియో సినిమా తమ యాప్‌లో ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది.

చదవండి: Anant- Radhika: రోహిత్‌ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే!
రింకూ సింగ్‌కు బంపరాఫర్‌.. టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో ఛాన్స్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement