Rashid Khan: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 14) జరుగనున్న ఆసక్తికర సమరంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు చెరి 4 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు నమోదు చేశాయి. పాయింట్ల (6) ప్రకారం చూస్తే.. ఇరు జట్లు సమంగానే ఉన్నప్పటికీ ఆర్‌ఆర్ జట్టు మెరుగైన రన్‌రేట్ (+0.951) కలిగి ఉండటంతో టేబుల్ టాపర్‌గా ఉంది. +0.097 నెట్ రన్‌రేట్‌తో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. రన్‌రేట్‌లో తేడాను బట్టి చూస్తే.. గుజారత్ కంటే రాజస్థాన్ మెరుగ్గా ఉందని ఇట్టే అర్ధమవుతుంది.
ఇదిలా ఉంటే, ఇవాల్టి మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ప్రస్తుత సీజన్‌లో 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లతో సత్తా చాటిన రషీద్.. నేటి మ్యాచ్‌లో మరో వికెట్ పడగొడితే ఐపీఎల్‌లో వంద వికెట్లు పడగొట్టిన విదేశీ క్రికెటర్ల క్లబ్‌లో చేరతాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 80 మ్యాచ్‌లు ఆడిన రషీద్ 99 వికెట్లు సాధించాడు. రషీద్‌కు ముందు 100 వికెట్లు తీసిన విదేశీ బౌలర్ల జాబితాలో ముంబై మాజీ ప్లేయర్ లసిత్ మలింగ (170) ముందువరుసలో ఉన్నాడు. ఈ జాబితాలో మలింగ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ పేసర్ డ్వేన్ బ్రావో (174), కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ (147) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
చదవండి: వన్డేల్లో సరికొత్త రికార్డు.. 6 సిక్సర్లతో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు
Comments
Please login to add a commentAdd a comment