
పట్నా పైరేట్స్ పై ఘన విజయం
ప్రొ కబడ్డీ లీగ్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో హరియాణా స్టీలర్స్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోరులో హరియాణా స్టీలర్స్ 37–32 పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. లీగ్‌లో హరియాణా జట్టుకు ఇది వరుసగా నాలుగో విజయం కాగా... 36 పాయింట్లు ఖాతాలో వేసుకున్న స్టీలర్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
హరియాణా తరఫున వినయ్, మొహమ్మద్ రెజా చెరో 6 పాయింట్లతో సత్తా చాటారు. పట్నా తరఫున దేవాంక్, అయాన్ చెరో 7 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 47–28 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది.
తాజా సీజన్‌లో గుజరాత్‌కు ఇది రెండో విజయం కాగా... బెంగాల్‌కు మూడో పరాజయం. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), తమిళ్ తలైవాస్‌తో యు ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment