IPL 2022: Delhi Capitals Opener Prithvi Shaw Says Enjoys Batting With David Warner - Sakshi
Sakshi News home page

IPL 2022: "నేను వార్నర్ అభిమానిని.. అతడితో కలిసి ఓపెనింగ్‌ చేయడం సంతోషంగా ఉంది"

Published Fri, Apr 8 2022 3:19 PM | Last Updated on Thu, Jun 9 2022 6:40 PM

Have been David Warners fan says Prithvi Shaw - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా గురువారం(ఏప్రిల్‌7)న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి చెందినప్పటికీ.. ఆ జట్టు ఓపెనర్‌ పృథ్వీ షా మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 34 బంతుల్లోనే 61 పరుగులు సాధించి పృథ్వీ షా విధ్వంసం సృష్టించాడు. కాగా ఓటమిపై పృథ్వీ షా స్పందించాడు. మ్యాచ్‌ అనంతరం షా  మాట్లాడుతూ.. "లక్నో సూపర్‌ జెయింట్స్‌ ముందు మేము భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయాము.

ఈ మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించడం మాకు సానుకూల ఆంశం. ఈ ఓటమిని మేము దృష్టిలో పెట్టుకోము. తదపరి మ్యాచ్‌పై మేము దృష్టి సారిస్తాం. మేము ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్‌ సాధించకపోయినా.. చివర వరకు పోరాడాము. ఈ మ్యాచ్‌లో మేము చిన్న చిన్న తప్పులు చేశాము. తదుపరి మ్యాచ్‌లో అవి పునరావృతం కాకుండా చూసుకుంటాం "అని పేర్కొన్నాడు.

ఇక డేవిడ్‌ వార్నర్‌ గురించి పృథ్వీ షా మాట్లాడుతూ.." వార్నర్ దాదపు పదేళ్ల నుంచి  అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్‌కు పెద్ద అభిమానిని.నాన్-స్ట్రైకర్ ఎండ్ నుంచి ఒక బ్యాటర్‌ సిక్సర్లు, ఫోర్లు కొట్టడం చూడటం నాకు చాలా ఇష్టం. లక్నో మ్యాచ్‌లో వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది" అని పృథ్వీ షా చెప్పాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 10న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

చదవండి: IPL 2022: ధర 90 లక్షలు.. మొన్నటి దాకా బెంచ్‌కే పరిమితం.. కీలక వికెట్‌ తీసి.. ఆపై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement