Asia Cup 2022- India Vs Pakistan: ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న దుబాయ్ వేదికగా భారత్‌తో ఆడనుంది. ఈ క్రమంలో ఆసియాకప్ కోసం తీవ్రంగా నెట్స్‌లో శ్రమిస్తున్నట్లు పాకిస్తాన్ ఆటగాడు ఆసిఫ్ అలీ తెలిపాడు. అదే విధంగా ప్రాక్టీస్‌లో భాగంగా ప్రతీరోజు 100 నుంచి 150 సిక్సర్లు కొడుతున్నట్లు అలీ వెల్లడించాడు.
మ్యాచ్‌లో 4 నుంచి 5 సిక్స్‌లు కొడతా!
తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ.. "ఛేజింగ్‌లో రన్‌రేట్ 10కి పైగా అవసరమైన స్థితిలో బ్యాటింగ్ వస్తాను. కాబట్టి ఆ సమయంలో భారీ షాట్లు ఆడాలి. మన బాధ్యత నిర్వర్తించాలంటే దానికి చాలా ప్రాక్టీస్ అవసరం. అందుకే నా ప్రాక్టీస్‌లో భాగంగా ప్రతీ రోజు 100 నుంచి 150 సిక్సర్లు కొడుతున్నాను. తద్వారా మ్యాచ్‌లో కనీసం 4 నుంచి 5 సిక్స్‌లైనా కొట్టగలను" అని పేర్కొన్నాడు.
ఆడిన షాట్ మళ్లీ ఆడను!
అదే విధంగా తన షాట్ సెలక్షన్ గురుంచి మాట్లాడుతూ.. నేను బంతిని లైన్ అండ్ లెంగ్త్‌కు అనుగుణంగా కొట్టడానికి ప్రయత్నిస్తాను. ఇది మ్యాచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. నేను టీ20ల్లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సాదరణంగా నాపై ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌లోనైనా ఆడిన షాట్‌ను మళ్లీ ఆడాలని నేను ఎప్పుడూ అనుకోను ఆసిఫ్ అలీ తెలిపాడు. ఇక అలీ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘మ్యాచ్‌లో చూసుకుందాంలే.. మా బౌలర్లు కూడా బాగా ప్రాక్టీసు చేస్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక 2018లో పాకిస్తాన్ తరపున టీ20ల్లో అంతర్జాతీయ అరేంట్రం చేసిన అలీ.. జట్టులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సెమీఫైనల్ చేరడంలో అలీ కీలక పాత్ర పోషించాడు. ఇక ఆసియాకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
చదవండి: Ind Vs Pak- Virat Kohli: పాక్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి!
ICC ODI Rankings: క్లీన్‌స్వీప్‌లు.. టీమిండియా, పాకిస్తాన్ ఏ స్థానాల్లో ఉన్నాయంటే!
Comments
Please login to add a commentAdd a comment