టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన క్లబ్‌లో చేరాడు. టెస్ట్‌ల్లో 3000 పరుగుల మార్కును దాటాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రాహుల్ ఈ ఘనతను సాధించాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున 3000 పరుగుల మార్కును తాకిన 26వ ఆటగాడిగా రాహుల్ రికార్డుల్లోకెక్కాడు.
టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్‌కు (15921) దక్కుతుంది. ఓవరాల్‌గా చూసినా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసింది సచినే. రాహుల్ తన 54వ టెస్ట్‌లో 3000 పరుగుల మార్కును దాటాడు. రాహుల్ 92 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 3007 పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. పెర్త్ టెస్ట్‌లో ఆది నుంచి నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్.. ఓ వివాదాస్పద నిర్ణయానికి ఔటయ్యాడు. రాహుల్ 74 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 51/4గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్ ఖాతా తెరవకుండానే ఔట్ కాగా.. విరాట్ కోహ్లి 5, రాహుల్ 26 పరుగులు చేసి ఔటయ్యారు.
రిషబ్ పంత్ (10), ధృవ్ జురెల్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్, స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి సెషన్‌లో ఆసీస్ బౌలర్ల పూర్తి డామినేషన్ నడిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని తప్పుచేసిందేమో అనిపించింది. పిచ్‌పై బౌన్స్‌తో పాటు అనూహ్యమైన స్వింగ్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment