Ind Vs Aus 4th Test Ahmedabad Day 5 Updates:
డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ పేలవ డ్రాగా ముగిసింది. ఫలితంగా 4 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
68: ఓవర్లలో ఆసీస్ స్కోరు: 168-2
స్టీవ్ స్మిత్ 8, లబుషేన్ 58 పరుగులతో క్రీజులో ఉన్నారు.
57.2: లబుషేన్ అర్ధ శతకం
59.1: రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ట్రవిస్ హెడ్ బౌల్డ్. సెంచరీకి పది పరుగుల దూరంలో ఉన్న హెడ్ భారంగా పెవిలియన్ చేరాడు. ఆసీస్ స్కోరు: 153-2(60). 62 పరుగుల ఆధిక్యం
33 పరుగుల ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా
52 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు: 124/1. టీమిండియా కంటే 33 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో సెషన్ కొనసాగుతోంది. హెడ్ అద్భుత అర్ధశతకం (77)తో రాణిస్తుండగా.. లబుషేన్ 37 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
డ్రింక్స్ బ్రేక్ సమయానికి ఆసీస్ స్కోరు: 123-1(51)
41 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 82-1
లబుషేన్ 29, హెడ్ 47 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా
టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో పోటీ పడిన శ్రీలంకకు న్యూజిలాండ్ చెక్ పెట్టింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన తొలి టెస్టులో లంకను కివీస్ 2 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో రోహిత్ సేన ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌లో జరిగే తుదిపోరులో ఆసీస్‌తో ట్రోఫీ కోసం తలపడనుంది.
కాగా భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది రెండోసారి. మొట్టమొదటి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ట్రోఫీని న్యూజిలాండ్ గెలిచింది. కోహ్లి సేనను ఓడించి కేన్ విలియమ్సన్ బృందం టైటిల్ ఎగురేసుకుపోయింది.
లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు: 73/1 (36)
హెడ్ 45, లబుషేన్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు కంటే ఆసీస్ ఇంకా 18 పరుగలు వెనుకబడి ఉంది. అంతకు ముందు అశ్విన్‌కు ఒక వికెట్ లభించిన విషయం తెలిసిందే.
31 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 65/1.
అర్ధ శతకం దిశగా హెడ్
ట్రవిస్ హెడ్ 40, లబుషేన్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఆసీస్ ఇంకా 26 పరుగులు వెనుకబడి ఉంది.
నిలకడగా ఆడుతున్న ఆసీస్ బ్యాటర్లు
25 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు- 44/1. ట్రవిస్ హెడ్ 24, మార్నస్ లబుషేన్ 14 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతున్నారు. టీమిండియా కంటే ఆస్ట్రేలియా ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది.
15 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 20/1
ట్రవిస్ హెడ్ 11, మార్నస్ లబుషేన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఆసీస్ ఇంకా 71 పరుగులు వెనుకబడి ఉంది.
11: ఆస్ట్రేలియా స్కోరు: 14-1
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
10.4: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదో రోజు ఆటలో భారత్‌కు తొలి వికెట్ అందించాడు. అశూ బౌలింగ్‌లో కుహ్నెమన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
10 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 14/0
టీమిండియా కంటే ఇంకా 77 పరుగులు వెనుకబడి ఉంది. కుహ్నెమన్ 6, ట్రవిస్ హెడ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మార్చి 9న నాలుగో టెస్టు ఆరంభం
టాస్- ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్
స్ట్రేలియా తొలి ఇన్నింగ్స్- 480
టీమిండియా తొలి ఇన్నింగ్స్- 571
నాలుగో రోజు ఆటలో
విరాట్ కోహ్లి (364 బంతుల్లో 186; 15 ఫోర్లు) భారీ శతకంతో చివరి టెస్టులో భారత్ పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 178.5 ఓవర్లలో 571 పరుగుల వద్ద ఆలౌటైంది. నాలుగో రోజు ఆటలో అక్షర్ పటేల్ (113 బంతుల్లో 79; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కోహ్లితో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 91 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆఖరి రోజు సోమవారం ఉదయం ఆతిథ్య బౌలర్లు కూడా సమష్టిగా ఓ చేయి వేసి... ఆసీస్‌ను 200 పరుగుల్లోపు కట్టడి చేస్తే ఛేదించే లక్ష్యం మన ముందుంటుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ వేటకు శుభం కార్డు పడుతుంది.
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టు
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ.
ఆస్ట్రేలియా
ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్
Comments
Please login to add a commentAdd a comment