IND vs AUS 3rd Test: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. గబ్బా టెస్టుకు వర్షం ముప్పు? | IND Vs AUS 3rd Test: Rain To Wash Away Indias WTC Final Chances? Check About Weather Conditions In Brisbane | Sakshi
Sakshi News home page

IND vs AUS 3rd Test: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. గబ్బా టెస్టుకు వర్షం ముప్పు?

Published Thu, Dec 12 2024 8:25 AM | Last Updated on Thu, Dec 12 2024 9:57 AM

IND vs AUS: Rain to wash away Indias WTC Final chances?

బోర్డ‌ర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా మ‌ధ్య మూడో టెస్టు డిసెంబర్ 14న గబ్బా వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌ని టీమిండియా భావిస్తుంటే.. కంగారులు మాత్రం త‌మ జోరును కొన‌సాగించాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.

అయితే ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అంతరాయం క‌లిగించే అవ‌కాశ‌ముంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ జరగనున్న ఐదు రోజుల్లోనూ 40శాతం వర్షం కురిసే ఛాన్స్ ఉన్న‌ట్లు అక్యూవెద‌ర్ తెలిపింది.

గ‌త రెండు రోజుల నుంచి బ్రిస్బేన్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న‌ట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో మూడో టెస్టు మ్యాచ్ జరగడం కష్టమని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

దీంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌ భారత్‌కు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ గబ్బా టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిందే.

కాగా తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించగా..  రెండో టెస్టులో ఆతిథ్య ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమంగా ఉంది.

బ్రిస్బేన్‌లో వాతవారణం ఎలా ఉంటుందంటే?
👉డే 1-50 శాతం వర్షం పడే  ఛాన్స్‌
👉డే 2-40 శాతం వర్షం పడే  ఛాన్స్‌
👉డే 3- 40 శాతం వర్షం పడే ఛాన్స్‌
👉డే 4- 30 శాతం వర్షం పడే ఛాన్స్‌
👉డే 5- 40 శాతం​ వర్షం పడే ఛాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement