Ind Vs Eng: రీషెడ్యూల్డ్‌ టెస్టు గెలవాల్సింది.. కానీ: రోహిత్‌ శర్మ | Ind Vs Eng T20: Rohit Sharma Disappoint On Test Loss England Challenge Side | Sakshi
Sakshi News home page

Rohit Sharma: రీషెడ్యూల్డ్‌ టెస్టు గెలవాల్సింది.. ఆ ఓటమి ప్రభావం..: రోహిత్‌ శర్మ

Published Thu, Jul 7 2022 10:52 AM | Last Updated on Thu, Jul 7 2022 11:28 AM

Ind Vs Eng T20: Rohit Sharma Disappoint On Test Loss England Challenge Side - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(PC: BCCI)

India Vs England T20 Series- Rohit Sharma Comments: వేదికగా జరిగిన ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో పరాజయంపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విచారం వ్యక్తం చేశాడు. రీషెడ్యూల్డ్‌ టెస్టులో గెలిస్తే సిరీస్‌ తమ సొంతమై ఉండేదన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓటమి ప్రభావం పరిమిత ఓవర్ల సిరీస్‌పై ఉంటుందా అంటే కాలమే ఇందుకు సమాధానమిస్తుందని వ్యాఖ్యానించాడు.

కాగా గతేడాది టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఆఖరి టెస్టు.. కరోనా కలకలం కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా టూర్‌లో భాగంగా జూలై 1-5 మధ్య ఈ మ్యాచ్‌ను నిర్వహించారు. ఇక మొదటి నాలుగు టెస్టుల్లోనూ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్‌... కరోనా బారిన పడటంతో ఈ రీషెడ్యూల్డ్‌ టెస్టుకు దూరమయ్యాడు.

దీంతో అతడి స్థానంలో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే, మూడో రోజు వరకు టీమిండియా చేతిలో ఉన్న మ్యాచ్‌ ఒక్కసారిగా ఇంగ్లండ్‌ బ్యాటర్ల విజృంభణతో చేజారింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్‌ సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

ఈ క్రమంలో గురువారం (జూలై 7) నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానున్న తరుణంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియాతో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడాడు.

కోవిడ్‌ నుంచి కోలుకున్న రోహిత్‌.. ‘‘మ్యాచ్‌ గెలవకపోవడం నిరాశకు గురిచేసింది. నిజానికి టెస్టు సిరీస్‌ ఇండియా గెలవాల్సింది. ఏదేమైనా.. ఈ ఓటమి ప్రభావం ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లపై ఉంటుందా అంటే చెప్పలేం. అన్నీ వేర్వేరు ఫార్మాట్లు కదా’’ అని పేర్కొన్నాడు.

ఇక ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ జరుగనున్న నేపథ్యంలో.. ‘‘వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. ఇకపై ప్రతి సిరీస్‌ మాకు ఎంతో కీలకమైనదే.

ప్రతి మ్యాచ్‌ ముఖ్యమే. ఇక ఇంగ్లండ్‌తో పోరు మాకు చాలెంజ్‌ వంటిదే’’ అని రోహిత్‌ అన్నాడు. తాజా జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఐర్లాండ్‌తో పాటు కొన్ని ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడారు కాబట్టి ఇక్కడ కూడా రాణిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు.

చదవండి: Trolls On BCCI: కోహ్లి తప్పుకొన్నాక.. పరిస్థితి మరీ ఇంతలా దిగజారిందేంటి? బీసీసీఐపై ట్రోల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement