Ind Vs Nz 1st T20I: Rohit Sharma 9 Years Back Old Tweet Goes Viral After India Victory - Sakshi
Sakshi News home page

IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో విజయం.. రోహిత్‌ 9 ఏళ్ల క్రితం ట్వీట్‌ వైరల్‌

Published Thu, Nov 18 2021 3:25 PM | Last Updated on Thu, Nov 18 2021 3:52 PM

IND vs NZ: Rohit Sharma 9 Years Old Tweet Viral After India Won 1st T20I - Sakshi

Rohit Sharma 9 Years Old Tweet Viral After India Won Match Vs NZ.. టీమిండియా టి20 కెప్టెన్‌గా కోహ్లి నుంచి బాధ్యతలు తీసుకున్న రోహిత్‌ శర్మ మొదటి అడుగులో సక్సెస్‌ అయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20లో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. రోహిత్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఇది తొలి విజయం కాగా.. అటు టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ ద్రవిడ్‌కు కూడా తొలి విజయమే. మ్యాచ్‌ విజయం నేపథ్యంలో రోహిత్‌ శర్మ తొమ్మిదేళ్ల క్రితం చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: సిరాజ్‌ను ‘కొట్టిన’ రోహిత్‌ శర్మ.. ‘ఏంటి భయ్యా ఇది’.. వీడియో వైరల్‌!

రంజీ ట్రోఫీలో భాగంగా నవంబర్‌ 7, 2012న జైపూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించాడు. అప్పటి మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ తన ట్విటర్‌లో కామెంట్‌ను షేర్‌ చేశాడు. '' జైపూర్‌లో కెప్టెన్‌గా అడుగుపడింది. దీనిని సంతోషంగా స్వీకరిస్తున్నా. ఈ కెప్టెన్‌ పదవి నాకు మరిన్ని బాధ్యతలను పెంచింది.'' అంటూ ట్వీట్‌ చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయం అనంతరం రోహిత్‌ శర్మను అభినందిస్తూ ఒక అభిమాని రోహిత్‌ పాత ట్వీట్‌ను రీట్వీట్‌ చేశాడు.

''జైపూర్‌లో అడుగుపెట్టిన తొలిసారి రోహిత్‌ రంజీ ట్రోఫీలో ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు.. ఇప్పుడు సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత అతను టీమిండియాకు టి20ల్లో ఫుల్‌టైం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. జైపూర్‌ అతనికి బాగా కలిసివచ్చింది.'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఇక మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 48 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇరుజట్ల మధ్య రెండో టి20 నవంబర్‌ 19న జరగనుంది.

చదవండి: Rohit Sharma: నా వీక్‌నెస్‌ బౌల్ట్‌కు బాగా తెలుసు.. ట్రాప్‌లో పడిపోయా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement