Ind Vs Nz: Why Captain Rohit Sharma Slaps Mohammed Siraj, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ind Vs Nz 1st T20: సిరాజ్‌ను ‘కొట్టిన’ రోహిత్‌ శర్మ.. ‘ఏంటి భయ్యా ఇది’.. వీడియో వైరల్‌!

Published Thu, Nov 18 2021 2:18 PM | Last Updated on Fri, Nov 19 2021 9:01 PM

Ind Vs Nz: Why Captain Rohit Sharma Slaps Mohammed Siraj Video Goes Viral - Sakshi

(Photo Source: Disney+Hotstar)

Ind Vs Nz 1st T20: Why Captain Rohit Sharma Slaps Mohammed Siraj, Video Goes Viral: టీమిండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం అందుకున్నాడు. జైపూర్‌ వేదికగా టీ20 వరల్డ్‌కప్‌-2021 రన్నరప్‌ న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది.. ఈ మ్యాచ్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకున్నాడు. ఇక హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ మార్గనిర్దేశనంలో టీమిండియా ఆడిన మొదటి మ్యాచ్‌ కూడా ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో గురువారం నాటి మ్యాచ్‌తో భారత పురుషుల జట్టు చరిత్రలో నవ శకం ఆరంభమైందనే చెప్పవచ్చు. 

ఇదిలా ఉండగా.. లక్ష్య ఛేదనలో భాగంగా టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. డగౌట్‌లో ద్రవిడ్‌, కేఎల్‌ రాహుల్‌, సిరాజ్‌తో కలిసి కూర్చున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ చిలిపి పని చేశాడు. తదేకంగా ఓవైపు చూస్తూ ఉండిపోయిన సిరాజ్‌ నెత్తిపై మొట్టికాయ వేశాడు. ఊహించని ఈ పరిణామానికి అవాక్కైన సిరాజ్‌ నవ్వుతూ.. ‘‘ఏంటి భయ్యా ఇది’’ అన్నట్లుగా ఓ లుక్కు ఇచ్చాడు.

‘రోహిత్‌ సిరాజ్‌ను ఎందుకు కొట్టాడు’ అంటూ ఓ నెటిజన్‌ షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.  ఇక ఈ మ్యాచ్‌లో మహ్మద్‌ సిరాజ్‌.. 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. కివీస్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్రను పెవిలియన్‌కు పంపి.. అతడి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

స్కోర్లు:
న్యూజిలాండ్‌- 164/6 (20)
ఇండియా- 166/5 (19.4)

చదవండి: Rohit Sharma: రోహిత్‌ శర్మ కెప్టెన్సీ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.. కానీ ఆ తప్పు చేస్తాడని అనుకోలేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement