IND Vs PAK, Asia Cup 2022: Virat Kohli Priceless Reaction After Ravindra Jadeja Survives LBW Call Via DRS - Sakshi
Sakshi News home page

Ind Vs Pak- Virat Kohli: జడ్డూ సేఫ్‌! హమ్మయ్య బతికిపోయాం.. కోహ్లి రియాక్షన్‌ వైరల్‌

Published Mon, Aug 29 2022 11:16 AM | Last Updated on Mon, Aug 29 2022 12:43 PM

Ind Vs Pak: Virat Kohli Reaction After Jadeja Survives LBW Call Bach Gaye - Sakshi

రవీంద్ర జడేజా- హార్దిక్‌ పాండ్యా(PC: BCCI Twitter)

Asia Cup 2022 India Vs Pakistan: ఆసియా కప్‌-2022 టోర్నీలో దాయాది పాకిస్తాన్‌పై విజయంతో శుభారంభం చేసింది టీమిండియా. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా భారత పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌ 4, అర్ష్‌దీప్‌ 2, హార్దిక్‌ పాండ్యా 3, ఆవేశ్‌ ఖాన్‌ ఒక వికెట్‌తో విజృంభించడంతో పాక్‌ 147 పరుగులకు ఆలౌట్‌ అయింది.

అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(12 పరుగులు)తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. పాకిస్తాన్‌ అరంగేట్ర(టీ20లలో) బౌలర్‌ నసీమ్‌ షా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 

కోహ్లి అవుటయ్యాక..
ఈ క్రమంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌ కోహ్లి.. 34 బంతుల్లో  3 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 35 పరుగులు చేసి క్రీజును వీడాడు. ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రవీంద్ర జడేజా బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఓవైపు రన్‌రేటు పడిపోతున్నా.. పట్టుదలగా నిలబడ్డాడు జడ్డూ. మరో ఎండ్‌లో ఉన్న హార్దిక్‌ పాండ్యాకు సహకారం అందిస్తూ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 35 పరుగులు చేశాడు. అయితే, కీలకమైన సమయంలో నసీమ్‌ షా( 17.4వ ఓవర్లో) ఎల్బీడబ్ల్యూకు అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ అవుటిచ్చాడు. కానీ.. జడేజా మాత్రం ఎంతో కాన్ఫిడెంట్‌గా రివ్యూకు వెళ్లగా ఫలితం నాటౌట్‌గా తేలింది.

హమ్మయ్య బతికిపోయాం!
దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఫలితం కోసం డగౌట్‌లో కూర్చుని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కోహ్లి.. ‘బచ్‌ గయే(బతికిపోయాం)’ అన్నట్లుగా రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఇక నసీమ్‌ బౌలింగ్‌లో లైఫ్‌ పొందిన జడేజా.. ఆ మరుసటి బంతికి సిక్సర్‌ బాదాడు. ఆఖరి ఓవర్‌ మొదటి బంతికి మహ్మద్‌ నవాజ్‌ బౌలింగ్‌లో జడ్డూ బౌల్డ్‌ అయ్యాడు. ఇక హార్దిక్‌ పాండ్యా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Asia Cup 2022: 'కూల్‌గా ఉండు కార్తీక్‌ భాయ్‌.. నేను ఫినిష్‌ చేస్తా'! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement