![Ind vs Sa 1st Test: Virat Kohli Waves At Daughter In Stands After Historic Win - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/31/virat-kohli_0.jpg.webp?itok=d3qtRmVW)
PC: Starsports
టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో ఘోర పరాభవం... పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన తర్వాత... వన్డే క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచి తొలగింపు.. వెరసి విరాట్ కోహ్లికి దక్షిణాఫ్రికా టూర్ సవాల్‌గా మారింది. ముఖ్యంగా సఫారీ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ విజయం కూడా సాధించని నేపథ్యంలో ఎలాగైనా ఆ ఘనత సాధించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాలని అతడు భావించడం సహజం. ఈ నేపథ్యంలో సఫారీలకు కంచుకోటలాంటి సెంచూరియన్‌లో వారిని మట్టికరిపించి ఘన విజయం నమోదు చేసింది కోహ్లి బృందం.
ముఖ్యంగా పేసర్లు అద్భుతంగా రాణించడంతో 113 పరుగుల తేడాతో తొలి టెస్టులో గెలుపొంది 1-0తో సిరీస్‌లో ముందంజలో నిలిచింది. దీంతో టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ కోహ్లి సైతం అంతులేని సంతోషంలో మునిగిపోయాడు. ఈ సంతోషాన్ని తన భార్యాబిడ్డలతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా తన గారాల పట్టి వామిక మొదటి పుట్టినరోజు నేపథ్యంలో కుటుంబంతో కలిసి సౌతాఫ్రికాకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కోహ్లి సతీమణి అనుష్క శర్మ తమ ముద్దుల కూతురు వామికతో కలిసి మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన అనంతరం కోహ్లి భార్యాబిడ్డలను చూస్తూ ‘‘గెలిచాం’’ అన్నట్లుగా సిగ్నల్స్ ఇస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు స్పందించిన అభిమానులు.. ‘‘డాడీ గెలిచాడు చిట్టితల్లీ... అన్నట్లు కోహ్లి భాయ్ ముఖంలో వెలకట్టలేని ఆ సంతోషం చూడండి.. నిజంగానే వామికా అదృష్టదేవత’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వామిక జనవరి 11న తన మొదటి బర్త్‌డే జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే.
చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం!
First match of vamika in the stands. Virat gesturing this to his family.
— Siddhi 🌻 (@Sectumsempra187) December 30, 2021
God, protect them 🧿🥺
Do it for your girls, Virat! Do it for them.
VC - @StarSportsIndia#ViratKohli #INDvSA #AnushkaSharma #Virushka pic.twitter.com/QyEHree6NL
Daddy kohli waving at her princess 💗🥺#AnushkaSharma #ViratKohli #virushka pic.twitter.com/3scbHcwZJ7
— S💫 (@veenushkie) December 30, 2021
Comments
Please login to add a commentAdd a comment