Virat Kohli Misses 2nd Test: దక్షిణాఫ్రికాతో వాండరర్స్ టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లి దూరమవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెటేతర కారణాల వల్లే అతడు ఆఖరి నిమిషంలో వైదొలిగాడా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వెన్ను నొప్పి కారణంగానే దూరమైతే... ఆదివారం నాటి పత్రికా సమావేశంలో ఎందుకు అప్‌డేట్ ఇవ్వలేదంటూ ఆరాలు తీస్తున్నారు. కాగా రెండో టెస్టు కోసం కోహ్లి నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కూడా.
ఈ నేపథ్యంలో ప్రొటిస్‌తో మ్యాచ్‌లో సెంచరీ బాది సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ... టాస్ సమయంలో జట్టుకు కోహ్లి దూరమయ్యాడన్న వార్త బయటకు వచ్చింది. వెన్ను నొప్పి కారణంగా అతడు రెండో టెస్టు నుంచి తప్పుకొన్నట్లు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. దీంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.
అదే సమయంలో హేటర్స్ మాత్రం కోహ్లి ఫిట్‌నెస్‌పై సెటైర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు.. ‘‘కోహ్లి ఫిట్‌నెస్ నుంచి అభిమానులు గొప్పలు చెప్పుకుంటారు కదా.. ఇప్పుడు మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు. కొత్త ఏడాది మొదటి మ్యాచ్‌కే మీ కెప్టెన్ దూరమయ్యాడు. ఇప్పుడేమంటారు.. గర్వం అణిగిందా. ముఖాలు మాడిపోయాయా’’ అంటూ వ్యంగ్య రీతిలో స్పందిస్తున్నారు. ఇక కోహ్లి స్థానంలో హనుమ విహారి జట్టులోకి రాగా... కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా, బుమ్రా అతడికి డిప్యూటీగా బాధ్యతలు చేపట్టారు.
చదవండి: Rahul Dravid - Virat Kohli: అందుకే కోహ్లి డుమ్మా కొట్టాడన్న హెడ్‌కోచ్!
Kohli fans were bragging about his fitness and now their faces are in mud .. poetic justice#INDvsSA#INDvSA#SAvsIND#SAvIND
— Mishra 🇮🇳 (@itsAKMishra__) January 3, 2022
Toota hai Virat Kohli ki fitness ka ghamand pic.twitter.com/XpABP8xgXq
— Sudhanshu Ranjan Singh (@memegineers_) January 3, 2022
Virat shared pictures, trained at nets. No way he has a fitness issue. No mention of it in yesterday's PC. #Kohli
— Arpan (@ThatCricketHead) January 3, 2022
Kohli's century drought has now extended to him not being able to play his 100th Test on time #INDvSA
— AayushKataria (@aayush11kataria) January 3, 2022
Comments
Please login to add a commentAdd a comment