Ind Vs Sa 2021-22: CSA Assures Players Immediate Return If Covid Situation Worsens -Sports News in Telugu
Sakshi News home page

Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం!

Published Wed, Dec 22 2021 12:01 PM | Last Updated on Wed, Dec 22 2021 12:39 PM

IND Vs SA 2021-22 - Sakshi

PC: BCCI

Omicron- India Tour Of South Africa: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయం వెంటాడుతున్న తరుణంలోనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. తొలుత అనుకున్న ప్రకారం మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడాల్సి ఉండగా.. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో టీ20 సిరీస్‌ను వాయిదా వేసి మిగతా సిరీస్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీసు మొదలుపెట్టేశాయి కూడా. అయితే, ఓవైపు సిరీస్‌ ఆరంభం కానుందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ సంతోషపడుతున్నా...  తమ అభిమాన ఆటగాళ్ల క్షేమం గురించిన ఆందోళన కూడా వారిని వెంటాడుతోంది.

మరోవైపు కేవలం డబ్బు కోసం క్రికెటర్ల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా క్రికెట్‌ ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ షూయబ్‌ మంజ్రా ఊరట కలిగించే వార్త చెప్పారు. ఒకవేళ ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరిగి.. సరిహద్దులు మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తితే.. వెంటనే టీమిండియా క్రికెటర్లను స్వదేశానికి పంపించేందుకు కావాల్సిన అనుమతులు తీసుకున్నామన్నారు.

చదవండి: BCCI: ఒమిక్రాన్‌ సోకదా? మనోళ్లు ఏమైనా తోపులా?

ఈ మేరకు... ‘‘భారత జట్టు సురక్షితంగా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నాం. అయితే, ఏదేని కారణం వల్ల వారు దక్షిణాఫ్రికా విడిచి వెళ్లాలనుకుంటే.. అప్పటికప్పుడు ఇండియా వెళ్లవచ్చు. ఒకవేళ సరిహద్దులు మూసివేసినా.. వారిని సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు కావాల్సిన అనుమతులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది’’ అని మంజ్రా పేర్కొన్నారు.

ఇక బీసీసీఐ అధికారి ఈ విషయం గురించి చెబుతూ.. ‘‘మేము సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు అధికారులతో టచ్‌లో ఉన్నాం. టీమిండియా సురక్షిత వాతావరణంలోనే ఉంది. అయితే, మనకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా.. వెంటనే తిరిగి వచ్చేందుకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తామని మాట ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చారు. కాగా డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

చదవండి: IND Vs SA: అతిపెద్ద సవాల్‌.. దక్షిణాఫ్రికాపై గెలవడం అంత ఈజీ కాదు: టీమిండియా మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement