సౌరవ్ గంగూలీ
Ind Vs SA ODI Series: ‘‘ఇటీవలి కాలంలో అతడు చాలా బాగా ఆడుతున్నాడు. మా ప్రణాళికల్లో అతడి పేరు ఉంది. రెగ్యులర్‌గా టీమిండియాకు ఆడతాడు’’ అని కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. సంజూ అద్భుతమైన బ్యాటర్ అని, అయితే దురదృష్టవశాత్తూ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని పేర్కొన్నాడు. తృటిలో అవకాశం అతడి చేజారిందన్నాడు.
కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా సూపర్!
ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచిన సంజూ.. ఆ తర్వాత టీమిండియా తరఫున గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతడికి టీ20 వరల్డ్‌కప్-2022 ఆడనున్న భారత జట్టులో మాత్రం చోటు దక్కలేదు.
క్లీన్‌స్వీప్‌తో అదరగొట్టి
ఈ నేపథ్యంలో బీసీసీఐ, సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై సంజూ ఫ్యాన్స్ మండిపడ్డారు. సంజూ పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలో న్యూజిలాండ్- ఏ జట్టుతో స్వదేశంలో అనధికారిక వన్డే సిరీస్‌కు సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. చెన్నై వేదికగా జరిగిన ఈ సిరీస్‌ను సంజూ సారథ్యంలోని భారత- ఏ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా సంజూకు మంచి మార్కులు పడ్డాయి.
ఇదిలా ఉంటే.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. అయితే, ఇప్పటి వరకు జట్టును ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. సంజూ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఇక్కడ ప్రతిభ గల ఆటగాళ్లకు కొదువలేదు
ఈ నేపథ్యంలో.. మీడియాతో మాట్లాడిన గంగూలీ.. ‘‘త్రివేండ్రం నుంచి చాలా మంది క్రికెటర్లు వచ్చారు. గత రంజీ ట్రోఫీ టోర్నీలో రోహన్ కన్నుమాల్ మూడు సెంచరీలు చేశాడు. ఇక్కడ ప్రతిభ గల ఆటగాళ్లకు కొదువలేదు. బాసిల్ థంపి ఇక్కడి వాడే. నాకు తెలిసి సంజూ శాంసన్ కూడా త్రివేండ్రం నుంచే వచ్చాడు’’ అని వ్యాఖ్యానించాడు.
సంజూ సూపర్
ఈ సందర్భంగా.. సంజూ శాంసన్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. గత కొన్నాళ్లుగా అతడు అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడని ఐపీఎల్‌లోనూ తన జట్టును ఫైనల్‌కు చేర్చి కెప్టెన్‌గానూ సత్తా చాటాడని ప్రశంసించాడు. టీమిండియాలో కచ్చితంగా రెగ్యులర్ ఆటగాడు అవుతాడని గంగూలీ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సంజూ ఎంపికయ్యే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. టీమిండియా అత్యంత చెత్త రికార్డు!
Rohit Sharma: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. మొదటి టీమిండియా బ్యాటర్‌గా.. ఆ వెనుకే!
Comments
Please login to add a commentAdd a comment