Ind Vs SL T20: Mohammed Siraj Singing Song With Ishaan Kishan In Team Bus, Video Viral - Sakshi
Sakshi News home page

Ind Vs Sl 2nd T20: జోష్‌లో టీమిండియా.. పాట పాడిన సిరాజ్‌.. జత కలిసిన ఇషాన్‌, కుల్దీప్‌.. వైరల్‌

Published Sat, Feb 26 2022 4:04 PM | Last Updated on Sat, Feb 26 2022 6:13 PM

Ind Vs Sl 2nd T20: Mohammed Siraj Ishan Kishan Sing Song Way To Dharamshala - Sakshi

తరచూ ప్రయాణాలు చేయడం కూడా ఒక్కోసారి బోర్‌ కొడుతుంది. టీమిండియా క్రికెటర్లకు ఈ విషయం బాగా తెలుసు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుకు చెందిన మన ఆటగాళ్లు ఏడాదిలో 10 నెలలు ట్రావెల్‌ చేస్తూనే ఉంటారు. మరి అలాంటపుడు బోర్‌డమ్‌ను తరిమేయాలంటే సిరాజ్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి వాళ్లు పక్కనే ఉంటే సరి!

శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో విజయంతో జోరు మీదున్న టీమిండియా ఆటగాళ్లు రెండో మ్యాచ్‌ కోసం ధర్మశాలకు బయల్దేరారు. ఈ క్రమంలో సిరాజ్‌ ఒక్కసారిగా రాగం అందుకున్నాడు. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ సినిమాలోని మై హూ నా పాటను పాడుతూ సహచర ఆటగాళ్లలో జోష్‌ నింపే ప్రయత్నం చేశాడు.

ఇక ఇషాన్‌ కిషన్‌తో పాటు కుల్దీప్‌ యాదవ్‌ కూడా సిరాజ్‌కు జతకలిశారు. మొత్తానికి టీమ్‌ బస్‌లో వీరు ముగ్గురు ఎంజాయ్‌ చేశారు. తర్వాత విమానంలో పయనమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి!

చదవండి: Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement