
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును ఇవాళ అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ.. లక్నో, ధర్మశాల వేదికలుగా ఫిబ్రవరి 24, 26, 27 తేదీల్లో శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కు కూడా భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ నిమిత్తం స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్‌లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. విధ్వంసకర ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ సామ్సన్, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు తిరిగి జట్టులో చోటు కల్పించింది.
జడేజాతో పాటు విండీస్ సిరీస్‌కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా కూడా లంకతో సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. లంకతో టీ20 సిరీస్‌కు కూడా దూరంగా ఉండనున్నాడు. ఈ పర్యటనలో టీ20 సిరీస్ అనంతరం టీమిండియా రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 4-8 వరకు మొహాలీ వేదికగా తొలి టెస్ట్, బెంగళూరు వేదికగా 12-16 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహాల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్
చదవండి: శ్రీలంకతో సిరీస్‌లకు జట్టు ప్రకటన.. కోహ్లి, పంత్ దూరం
Comments
Please login to add a commentAdd a comment