IND vs WI 3rd ODI: Twitterverse React as Virat Kohli Bags Two-Ball Duck Against West Indies - Sakshi
Sakshi News home page

Ind Vs Wi 3rd ODI- Virat Kohli Duck Out: ఏంటిది కోహ్లి.. 8, 18, 0... మరీ ఇంత చెత్తగా.. తుది జట్టులో ఉంటావా? లేదా?

Published Fri, Feb 11 2022 2:36 PM | Last Updated on Fri, Feb 11 2022 4:26 PM

Ind Vs Wi 3rd ODI: Virat Kohli Duck Out Alzarri Joseph Removes Him - Sakshi

మూడో వన్డేలో కోహ్లి డకౌట్‌(PC: ICC)

పరుగుల యంత్రం ‘విరాట్‌ కోహ్లి’కి ఏమైంది? సెంచరీ చేసి రెండేళ్లు దాటిపోయింది. ఎప్పుడెప్పుడు శతకం బాదుతాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన జూనియర్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో వన్డే సిరీస్‌ ఆడిన కోహ్లి మొదటి వన్డేలో అర్ధ సెంచరీ(51 పరుగులు) చేశాడు.

ఆ తర్వాతి మ్యాచ్‌లో డకౌట్‌.. మళ్లీ మూడో వన్డేలో బ్యాట్‌ ఝులిపించాడు. 65 పరుగులతో రాణించాడు. కానీ.. సెంచరీ మార్కును మాత్రం అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌తో అయినా కోహ్లి శతకం సాధిస్తే చూడాలని ఫ్యాన్స్‌ ఆశపడ్డారు. విదేశీ గడ్డపై రాణించిన కోహ్లి స్వదేశంలో అదరగొడతాడని భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. విండీస్‌తో తొలి వన్డేలో 4 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 8 పరుగులకే అవుటయ్యాడు.

జోసెఫ్‌ బౌలింగ్‌లో రోచ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక రెండో వన్డేలో 30 బంతులు ఆడిన విరాట్‌... 18 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం మూడో వన్డేలోనైనా సెంచరీ చేస్తాడనుకుంటే.. ఊహించని రీతిలో డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. ‘‘ఏంటిది కోహ్లి... మరీ ఇంత చెత్త స్కోర్లు... ఇలా అయితే ఎలా? సెంచరీ కొట్టి ఎన్నేళ్లయిందో గుర్తుందా అసలు. ఇలా ఆడితే తుదిజట్టులో చోటు దక్కుతుందా లేదోనని భయం వేస్తోంది. మమ్మల్ని మరోసారి నిరాశపరిచావు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైటర్స్‌ సంగతి సరేసరి. మీమ్స్‌ షేర్‌ చేస్తూ కోహ్లి ఆట తీరుపై సెటైర్లు వేస్తున్నారు.

చదవండి: Virat Kohli: శ్రీవల్లి పాట‌కు స్టెప్పులేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైర‌ల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement