ట్రినిడాడ్ వేదికగా మంగళవారం జరగనున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో తాడోపేడో తెల్చుకోవడానికి భారత్-వెస్టిండీస్ జట్లు సిద్దమయ్యాయి. రెండో వన్డేలో ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తుంటే.. విండీస్ మాత్రం ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. తొలి వన్డేలో పేలవ ప్రదర్శన కనబరిచిన కరేబియన్ జట్టు, రెండో వన్డేలో మాత్రం ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.
ఇక ఇది ఉండగా.. విండీస్‌తో మూడో వన్డేకు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్‌కు భారత తుది జట్టులో అవకాశం ఇవ్వాలని జట్టు మెనెజ్‌మెంట్‌ను చోప్రా సూచించాడు. కాగా విండీస్‌తో జరిగిన రెండో వన్డేకు జట్టులోకి వచ్చిన శాంసన్ తీవ్ర నిరాశపరిచాడు.
ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న సంజూ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవలియన్‌కు చేరాడు. "ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వస్తాడో, మిడిలార్డర్‌లో బ్యాటింగ్ వస్తాడో మనకు తెలియదు. కాబట్టి నెం3లో సంజూ శాంసన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుంది. అతడు ఎటువంటి ఆటగాడో మనకు తెలుసు. ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే చాలు. అతడిని జట్టు నుంచి డ్రాప్ చేయకండి.
సంజూను కొనసాగిస్తే అద్భుతాలు సృష్టించగలడు. ఇక సూర్యకుమార్ యాదవ్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. అతడు టీ20లో అద్బుతంగా రాణిస్తున్నప్పటికీ.. వన్డేల్లో మాత్రం పూర్తిగా తెలిపోతున్నాడు. అతడు ఫామ్‌లోకి రావడం భారత జట్టు చాలా ముఖ్యం. అదే విధంగా హార్దిక్ పాండ్యా కూడా బ్యాట్‌తో రాణించాల్సిన అవసరం" ఉందని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: #Moeen Ali: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్..! ఈ సారి మెసేజ్ డిలీట్ చేస్తా
Comments
Please login to add a commentAdd a comment