India Tour OF West Indies 2023: వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. జూలై 12 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే భారత ఆటగాళ్లు ప్రాక్టీసులో తలమునకలు కాగా.. విండీస్ క్రికెట్ బోర్డు శనివారం తమ జట్టును ప్రకటించింది.
రోహిత్ సేనతో మొదటి టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇక అంతకంటే ముందుగానే.. కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ సారథ్యంలోని సన్నాహక జట్టు టీమిండియాతో పోరుకు అన్ని విధాలా సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 తర్వాత టీమిండియా ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో మొదటి సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. దీంతో భారత్‌కు విండీస్‌తో పోరు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ సేన రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.
ఇందులో భాగంగా రోహిత్ శర్మకు జోడీగా యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వీరిద్దరూ అర్ధ శతకాలతో ఆకట్టుకోగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఆఫ్ స్టంప్‌లో స్లిప్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చి 2 పరుగులకే అవుటయ్యాడు.
ఇదిలా ఉంటే.. కోహ్లి, రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. బార్బడోస్‌లో ఈ ఇద్దరు స్టార్లు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు.
ఇక ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం ఖాయంగా భావిస్తున్న యశస్వి జైశ్వాల్‌పై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా దృష్టి సారించాడు. కాగా జూలై 12 నుంచి అసలైన మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మరోసారి రెండు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్‌గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి
Preps in Barbados done ✅#TeamIndia off to Dominica next to begin training for the 1st Test against West Indies 👌👌#WIvIND pic.twitter.com/Ky5HSQcxR6
— BCCI (@BCCI) July 7, 2023
Comments
Please login to add a commentAdd a comment