
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కా�...
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2 మెయిన్స్ ప�...
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫై...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్�...
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్�...
నల్లగొండ: ఎస్ఎల్బీసీ పనుల్లో శనివారం...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్త...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాల�...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రిత�...
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మ...
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమ�...
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర�...
Published Sun, Feb 6 2022 1:21 PM | Last Updated on Mon, Feb 7 2022 8:31 AM
IND VS WI 1st ODI: లైవ్ అప్డేట్స్
That's that from the 1st ODI. #TeamIndia win their 1000th ODI by 6 wickets 👏👏
Scorecard - https://t.co/6iW0JTcEMv #INDvWI pic.twitter.com/vvFz0ftGB9
— BCCI (@BCCI) February 6, 2022
విండీస్ నిర్ధేశించిన 177 పరగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు.. మధ్యలో కాస్త తడబడినా చివరకు 6 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించి, 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోని దూసుకుపోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి గెలుపుకు పునాది వేయగ, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. కోహ్లి(8), పంత్(11) మరోసారి నిరుత్సాహపరిచారు. విండీస్ బౌలర్లలో జోసఫ్ 2 వికెట్లు, అకీల్ హొసేన్‌కు ఓ వికెట్ దిక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా బుధవారం(ఫిబ్రవరి 9) జరగనుంది.
177 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. తొలి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ(60) వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో టీమిండియా మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం 8 పరుగులకే వెనుదిరిగి మరోసారి నిరుత్సాహపరిచాడు. అనంతరం టీమిండియా 17వ ఓవర్లో ఇషాన్ కిషన్(28).. 18వ ఓవర్లో రిషబ్ పంత్(11)ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. విండీస్ బౌలర్లు అల్జరీ జోసఫ్ 2 వికెట్లు, అకీల్ హొసేన్ ఓ వికెట్ పడగొట్టగా.. పంత్ రనౌటయ్యాడు. 20 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 137/4గా ఉంది. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్(13), దీపక్ హూడా(7) ఉన్నారు. భారత్ గెలవాలంటే 30 ఓవర్లలో మరో 40 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి.
177 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(46 బంతుల్లో 55; 9 ఫోర్లు, సిక్స్), ఇషాన్ కిషన్(26 బంతుల్లో 15; 2 ఫోర్లు) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 12 ఓవర్లలో 77 పరుగులు జోడించి, జట్టును విజయం దిశగా తీసుకెళ్తున్నారు. టీమిండియా గెలుపుకు 38 ఓవర్లలో మరో 100 పరుగులు చేయాల్సి ఉంది.
భారత స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30)లు రెచ్చిపోవడంతో తొలి వన్డేలో విండీస్ జట్టు 176 పరుగులకే చాప చుట్టేసింది. స్పిన్నర్లకు పేసర్లు ప్రసిద్ద్ కృష్ణ(2/29), మహ్మద్ సిరాజ్(1/26) కూడా తోడవ్వడంతో విండీస్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. విండీస్ జట్టులో ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.
టీమిండియా బౌలర్లు విండీస్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ 2, చహల్ 3, పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలు తలో వికెట్ పడగొట్టారు. 21.5వ ఓవర్లో చహల్.. బ్రూక్స్(26 బంతుల్లో 12)ను పెవిలియన్‌కు పంపగా.. ఆ మరుసటి ఓవర్ ఐదో బంతికే ప్రసిద్ధ కృష్ణ.. అకీల్ హొసేన్‌ను డకౌట్ చేశాడు. ఫలితంగా విండీస్ జట్టు 23 ఓవర్లలో కేవలం 79 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది.
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్.. తన స్పిన్ మాయాజాలంతో విండీస్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. తాను వేసిన తొలి ఓవర్ మూడో బంతికే పూరన్(25 బంతుల్లో 18; 3 ఫోర్లు)ను ఎల్బీడబ్ల్యూ చేసిన అతను.. ఆ మరుసటి బంతికే విండీస్ కెప్టెన్ పోలార్డ్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా విండీస్ 20 ఓవర్లలో 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.
ఇన్నింగ్స్ 12వ ఓవర్లో విండీస్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాషింగ్టన్ సుందర్ వేసిన ఈ ఓవర్లో విండీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 11.2వ ఓవర్లో బ్రెండన్ కింగ్(26 బంతుల్లో 13; 2 ఫోర్లు), ఆఖరి బంతికి డార్రెన్ బ్రావో(34 బంతుల్లో 18; 3 ఫోర్లు)లను సుందర్ ఔట్ చేశాడు. 12 ఓవర్ల తర్వాత విండీస స్కోర్ 45/3గా ఉంది. క్రీజ్‌లో బ్రూక్స్, పూరన్ ఉన్నారు.
13 పరుగుల వద్ద హోప్ రూపంలో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన హోప్‌ను సిరాజ్ క్లీన్ బౌల్డయ్యాడు. 5 ఓవర్లు ముగిసేసరికి విండీస్ ఒక వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కింగ్(4), బ్రావో ఉన్నారు.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(వికెట్ కీపర్), షమర్ బ్రూక్స్, డారెన్ బ్రేవో, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, అకేల్ హోసేన్
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
వెస్టిండీస్‌తో తొలిపోరులో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment