టీమిండియా
ICC T20 World Cup 2022- Team India: తీవ్ర ఉత్కంఠ.. బంతికి బంతికీ టెన్షన్.. నాటకీయ పరిణామాలు.. ఎట్టకేలకు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం.. గెలుపుతో టీ20 ప్రపంచకప్-2022 టోర్నీని ఆరంభించిన టీమిండియా.. విరాట్ కోహ్లి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఎల్లకాలం గుర్తుండిపోయే విజయం..
వెరసి దీపావళికి ఓ రోజు ముందుగానే పండుగ.. ఇదే ఫైనల్ మ్యాచ్ అన్నంతగా సంతోషం.. అంబరాన్నంటిన అభిమానుల సంబరాలు.. మరి ఇలాంటి ఉద్విగ్న వాతావరణంలో ఆటగాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవడం ఖాయం..
పార్టీ కాన్సిల్
ఇదే జోష్‌లో భార్యాపిల్లలతో కలిసి పాక్‌పై విజయం నేపథ్యంలో సిడ్నీలో గ్రాండ్‌గా దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని భావించిందట భారత జట్టు. అయితే, కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సూచన మేరకు విరమించుకున్నారట ఆటగాళ్లు. ఇక తదుపరి నెదర్లాండ్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో సిడ్నీకి చేరుకున్న అనంతరం ఎవరికి వారుగా ఫ్యామిలీతో డిన్నర్‌కు వెళ్లి సరదాగా గడిపారట.
అదే ప్రధాన లక్ష్యం
ఈ విషయం గురించి బీసీసీఐ సహాయక సిబ్బంది ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘పాక్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత సంబరాలకు దూరంగా ఉండాలని.. ట్రోఫీ గెలవాలన్న లక్ష్యం మీద దృష్టి సారించాలని ఆటగాళ్లకు చెప్పారు. టోర్నమెంట్ ఇప్పుడే మొదలైంది కాబట్టి.. మరింత జాగ్రత్తగా ఆడాలని సూచనలు వచ్చాయి’’ అని పేర్కొన్నారు.
కాగా రోహిత్, విరాట్ వంటి సీనియర్లు.. ‘‘మరీ ఎక్కువగా సంతోషించాల్సిన అవసరం లేదు. మన ప్రధాన లక్ష్యం ట్రోఫీ గెలవడమే’’ అంటూ ఈ సందర్భంగా యువ ఆటగాళ్లతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన రోహిత్ సేన తదుపరి నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో తలపడనుంది.
చదవండి: T20 WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరడం నల్లేరుపై నడకే..!
Indian Captain: టీమిండియా ఆటగాడిపై పాక్ మాజీ క్రికెటర్ల ప్రశంసలు.. తదుపరి కెప్టెన్ అతడేనంటూ..
Comments
Please login to add a commentAdd a comment