బోర్డర్ గావస్కర్ ట్రోఫీ-2023లో టీమిండియా తొలి ఓటమి చవిచూసింది. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న రోహిత్ సేనకు.. మూడో టెస్టులో మాత్రం ఆస్ట్రేలియా చుక్కలు చూపించింది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆసీస్.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
ఇక ఈ మ్యాచ్ కూడా తొలి రెండు టెస్టులు మాదిరిగానే రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయింది. కేవలం ఏడు సెషన్లలోనే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. కాగా ఈ సిరీస్‌లో తొలి మూడు టెస్టులు కూడా రెండున్నర రోజుల్లోనే ముగియడంపై పలువురు మాజీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మను ప్రశ్నించగా, తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. పాకిస్తాన్‌లో ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లు అభిమానులకు విసుగు తెప్పిస్తున్నాయని, అందుకే భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆటను మూడు రోజుల్లో ముగించింది అని రోహిత్ చురకలు అంటించాడు.
"టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగాలంటే ఆటగాళ్లు అద్భుతంగా ఆడాలి. భారత్‌లో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా కొన్ని టెస్టులు ఐదు రోజుల పాటు జరగవు. ఊదాహరణకు నిన్న(గురువారం)దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు కూడా మూడో రోజుల్లోనే ముగిసింది. అయితే పాకిస్తాన్‌లో మాత్రం ఐదు రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్ బోర్ కొడుతుందని అభిమానులు అంటున్నారు.అందుకే మేము మ్యాచ్‌లను మూడు రోజుల్లో పూర్తి చేస్తున్నాము" అని రోహిత్ సీరియస్ అయ్యాడు.
చదవండి: IND vs AUS: వాళ్లిద్దరి వల్లే ఇలా! ఏదేమైనా పుజ్జీ భయపెట్టాడు.. సిరీస్ డ్రా చేసుకుంటాం: స్మిత్
Comments
Please login to add a commentAdd a comment