ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను టీమిండియా 1-2 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో కిందా మీదా పడి గెలిచిన టీమిండియా ఆ తర్వాత వరుసగా రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది. అయితే సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం అంత ఈజీ కాదని గతంలోని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఒకవేళ టీమిండియాను ఓడించినా అది ఆస్ట్రేలియానే అవుతుంది తప్ప మరో జట్టు కనిపించలేదు. 2018 నుంచి స్వదేశంలో టీమిండియా ఆడిన పది వన్డే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రెండుసార్లు మాత్రమే సిరీస్‌ను ఓడిపోయింది.. మిగతా ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది.
అయితే సొంతగడ్డపై రెండుసార్లు వన్డే సిరీస్ కోల్పోయింది ఆస్ట్రేలియాకే కావడం గమనార్హం. ఇంతకముందు 2019లో భారత్ పర్యటనకు వచ్చిన ఆసీస్ ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో గెలుచుకుంది. ఆ తర్వాత టీమిండియా వరుసగా ఏడు వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఆ ఏడు వన్డే సిరీస్‌లు వరుసగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ ఉన్నాయి.
తాజాగా మళ్లీ నాలుగేళ్ల తర్వాత 2023లో 2-1 తేడాతో ఆస్ట్రేలియా.. టీమిండియాను వారి సొంతగడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది. నాలుగేళ్లలో టీమిండియాను రెండుసార్లు వన్డే సిరీస్‌లో ఓడించడం ఒక్క ఆస్ట్రేలియాకే చెల్లింది. గత నాలుగేళ్లలో ఏడు వన్డే సిరీస్‌లు నెగ్గిన టీమిండియా సొంతగడ్డపై బెబ్బులే అయినప్పటికి.. ఆస్ట్రేలియాకు మాత్రం దాసోహం అవక తప్పలేదని అభిమానులు పేర్కొన్నారు.
చదవండి: సూర్యకుమార్ వన్డే కెరీర్ ముగిసినట్లే!
సూర్యకుమార్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment