టెహ్రాన్ (ఇరాన్): ఆసియా అండర్–18 పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 25–19, 25–14, 25–27, 25–23తో మాజీ చాంపియన్ తైనీస్ తైపీపై నెగ్గి ఈ టోర్నీలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
కుష్ సింగ్ 22 పాయింట్లు సాధించి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. సెమీస్ చేరడంద్వారా భారత్ వచ్చే ఏడాది జరిగే అండర్–19 ప్రపంచ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఆతిథ్య ఇరాన్‌తో భారత్ తలపడుతుంది.
చదవండి: Cincinnati Masters: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మెద్వెదెవ్
Comments
Please login to add a commentAdd a comment