( ఫైల్ ఫోటో )
ఆసియాకప్-2023లో పాల్గొనే భారత జట్టు ప్రకటనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్‌కు భారత జట్టును ఆగస్టు 20న బీసీసీఐ ప్రకటించనున్నట్లు సమాచారం. అదే రోజు ముంబైలో అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశం కానున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న భారత స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్.. ఈ మెగా టోర్నీతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.
అయితే మరో కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మాత్రం కాంటినెంటల్ కప్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెన్ను గాయంతో బాధపడుతన్న అయ్యర్.. కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అయ్యర్ ఏన్సీఏలో పునరావసంలో ఉన్నాడు.
ఇక అయ్యర్ స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సూర్య టీ20ల్లొ అదరగొడుతున్నప్పటికీ.. వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. అయ్యర్ జట్టుకు దూరమైనప్పటి నుంచి నెం4 బ్యాటింగ్ సమస్య భారత్‌ను వేధిస్తోంది. ఈ ఏడాది 6 వన్డేలు ఆడిన సూర్య కనీసం ఒక్కసారి కూడా 40 పరుగుల మార్క్‌ను దాటలేకపోయాడు.
కెఎల్ రాహుల్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతడు వికెట్ల మధ్య కూడా పరిగెత్తుతున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ మాత్రం పూర్తిగా కోలుకోలేదు. అతడు కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది. త్వరలో వీరిద్దరూ ఓ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనున్నారు. మా ఏన్సీఏ ఫిజియోలు కూడా వీరిద్దరూ ఫిట్‌నెస్ స్ధాయిని అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆసియాకప్‌కు మా జట్టును ప్రకటిస్తాము అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు.
చదవండి: ఇప్పుడు హసరంగా.. మొన్న హేల్స్! ప్రపంచ క్రికెట్‌లో అసలేం జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment