ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే అందరూ అనుకున్నదే జరిగింది. సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లకు కూడా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా దూరంగా ఉండాలని విరాట్ నిర్ణయించుకున్నట్లు భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇక కోహ్లితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే తొడకండరాల గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్.. తిరిగి జట్టులోకి వచ్చారు. కానీ వారిద్దరూ ప్రధాన జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. తుది జట్టులోకి రావాలంటే తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిందే.
బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి క్లియర్స్‌ను పొందితేనే తుది జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటారు. ఇక ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్,అవేష్ ఖాన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసిన సెలక్షన్ కమిటీ.. బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్‌కు తొలిసారి భారత టెస్టుకు ఎంపిక చేసింది.
అదే విధంగా రెండు టెస్టుకు భారత జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు కొనసాగించారు. ఇక ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది.
ఇంగ్లండ్‌తో మూడు టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్
చదవండి: IPL 2024: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!?
Comments
Please login to add a commentAdd a comment