సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ ఇదే | India To Tour South Africa For 4-Match T20I Series In November. Here Full Schedule | Sakshi
Sakshi News home page

IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ ఇదే

Published Fri, Jun 21 2024 3:18 PM | Last Updated on Fri, Jun 21 2024 3:46 PM

India to tour South Africa for four-match T20I series in November

భారత క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఖారారైంది. ఈ ఏడాది నవంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ మెరకు భారత క్రికెట్ బోర్డు(BCCI), ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(CSA)లు సంయుక్తంగా శుక్రవారం షెడ్యూల్ విడుద‌ల చేశాయి. 

ఈ టూర్‌లో భాగంగా సఫారీ గడ్డపై భారత్‌ నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్‌ 8న డర్బన్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో  సౌతాఫ్రికా క్రికెట్ ఛైర్‌పర్సన్ లాసన్ నైడూ మాట్లాడుతూ.. "దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తున్న బీసీసీఐకు దన్యవాదాలు. 

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఈ సిరీస్‌ జరిగిన అది అభిమానులకు ఎంతో అనుభూతిని కలిగిస్తోంది. ఈ రెండు క్రికెట్‌ బోర్డుల మధ్య స్నేహ బంధం ఎల్లప్పుడూ ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాను. దక్షిణాఫ్రికా-భారత్‌ మధ్య టీ20 సిరీస్‌ కోసం​ ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని" పేర్కొన్నారు. 

మరోవైపు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌పై బీసీసీఐ క్యార్యదర్శి జైషా సైతం భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌పై సంతోషం వ్యక్తం చేశారు.  సంతోషం వ్యక్తం చేశారు.  ఇరు జట్ల మద్య పోటీ ఇప్పుడు ఉత్కంఠభరితంగా ఉంటుందని జైషా తెలిపారు. 

కాగా 2024-2025 హోం సీజన్‌కు సంబంధించి టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ సీజన్‌ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌తో మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో ముగియనుంది.

టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌ షెడ్యూల్‌ ఇదే..
తొలి టీ20(డర్బన్‌)-నవంబర్‌ 8
రెండో టీ20(సెయింట్‌ జార్జ్‌ పార్క్‌)- నవంబర్‌ 10
మూడో టీ20(సెంచూరియన్‌)- నవంబర్‌ 13
నాలుగో టీ20(జోహన్స్‌బర్గ్‌)- నవంబర్‌ 15

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement