రాహుల్‌, గిల్‌ సెంచరీలు.. టీమిండియా ఆధిపత్యం | India vs Afghanistan Test Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

రాహుల్‌, గిల్‌ సెంచరీలు.. టీమిండియా ఆధిపత్యం

Jun 6 2026 9:05 AM | Updated on Jun 6 2026 5:05 PM

India vs Afghanistan Test Live Updates And Highlights

అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో శనివారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 368 పరుగులు సాధించింది. గిల్‌ 103, పంత్‌ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (24) నిరాశపరచగా.. కేఎల్‌ రాహుల్‌ (100) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ భారీ అర్ధ శతకం (81)తో అలరించాడు. అఫ్గన్‌ బౌలర్లలో మహ్మద్‌ సలీ సఫీ రెండు వికెట్లు తీయగా.. జియాఉర్‌ రహ్మాన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీ
82.5: సలీమ్‌ సఫీ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్‌ గిల్‌. 138 బంతుల్లో సెంచరీ చేసిన గిల్‌. స్కోరు: 358/3 83).

మూడు వందల మార్కు దాటిన టీమిండియా.. స్కోరు: 340/3(79)
గిల్‌ 91, పంత్‌ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌
సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరుసటి బంతికే రాహుల్‌ అవుట్‌. క్రీజులోకి రిషభ్‌ పంత్‌. స్కోరు: 249/3 (61). గిల్‌ 39 పరుగులతో ఉండగా.. పంత్‌ రెండు పరుగులతో ఉన్నాడు.

కేఎల్‌ రాహుల్‌ సెంచరీ
60.1: జియాఉర్‌ రహ్మాన్‌ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్‌ రాహుల్‌. కెరీర్‌లో 12వ టెస్టు సెంచరీ సాధించిన కర్ణాటక బ్యాటర్‌.

45 ఓవర్లలో టీమిండియా స్కోరు: 191-2
గిల్‌ 8, రాహుల్‌ 75 పరుగులతో ఉన్నారు.

సాయి సుదర్శన్‌ అవుట్‌
42.4: సలీమ్‌ సపీ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్‌ (81). సెంచరీకి పందొమ్మిది పరుగుల దూరంలో పెవిలియన్‌ చేరిన సాయి. క్రీజులోకి కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ రాగా.. రాహుల్‌ 72 పరుగులతో ఉన్నాడు.

సాయి అర్ద శతకం
31.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్‌లో ఫోర్‌ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్‌. స్కోరు: 133/1 (31.4)

కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీ
29.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్‌లో సింగిల్‌ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న కేఎల్‌ రాహుల్‌. టెస్టు కెరీర్‌లో అతడికి ఇది 21వ హాఫ్‌ సెంచరీ. 31 ఓవర్లలో టీమిండియా స్కోరు: 121-1.

లంచ్‌ బ్రేక్‌కు భారత్‌ స్కోరెంతంటే?
లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(37), సాయిసుదర్శన్‌(32) ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న సుదర్శన్‌, రాహుల్‌
21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(32), సాయిసుదర్శన్‌(26) ఉన్నారు.

తొలి వికెట్‌ డౌన్‌
టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 24 పరుగులు చేసిన జైశ్వాల్‌.. సలీం​ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

నిల‌క‌డ‌గా ఆడుతున్న భార‌త్‌
భార‌త ఓపెన‌ర్లు  రాహుల్‌(16), య‌శ‌స్వి జైశ్వాల్‌(20) నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. 10 ఓవ‌ర్ల‌కు ముగిసే స‌రికి టీమిండియా వికెట్ న‌ష్ట‌పోకుండా 37 ప‌రుగులు చేసింది. 16 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు.

బ్యాటింగ్‌ భారత్‌దే
ముల్లాన్‌పూర్ వేదికగా భారత్‌-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌తో రాజస్తాన్‌ లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్నర్‌ మానవ్‌ సుత్తార్‌ భారత తరపున అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడికి టీమిండియా తరపున ఆడే అవకాశం లభించింది.

అదేవిధంగా సాయిసుదర్శన్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కింది. ఈ తమిళనాడు ఆటగాడు ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ రానున్నాడు. ఆంధ్ర క్రికెటర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌కు ఛాన్స్‌ ఇచ్చారు.

తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీ

భారత్ : కేఎల్‌ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), రిషబ్ పంత్(వికెట్ కీపర్‌), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement