రెండో టీమిండియా క్రికెటర్‌గా‌ రోహిత్‌ శర్మ.. | India vs England 4th T20 Rohit Sharma Reach 9000 Runs In T20 Format | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ రికార్డు.. భారత రెండో క్రికెటర్‌గా

Published Thu, Mar 18 2021 10:20 PM | Last Updated on Thu, Mar 18 2021 10:20 PM

India vs England 4th T20 Rohit Sharma Reach 9000 Runs In T20 Format - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 9 వేల పరుగుల క్లబ్‌లో చేరిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌ సందర్భంగా హిట్‌మ్యాన్‌ ఈ రికార్డు సాధించాడు. ఇంగ్లిష్‌ బౌలర్‌ ఆదిల్‌ రషీద్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతినే సిక్స్‌గా మలిచిన రోహిత్‌.. అదే ఓవర్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

కాగా ఈ జాబితాలో టీమిండియా తరఫున కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందు వరుసలో ఉండగా, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ ప్రస్తుతం ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా టీ20ల్లో ఈ రికార్డు సాధించిన ఆటగాళ్లలో రోహిత్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక భారత్‌- ఇంగ్లండ్‌ నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ కొనసాగుతోంది. ఆతిథ్య జట్టు ఇప్పటి వరకు 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(12, ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌), కేఎల్‌ రాహుల్‌(14), కోహ్లి(1) అవుటయ్యారు.  

చదవండి: ఏంది రెడ్డి.. ఏకంగా ధోని వికెట్‌నే లేపేసావు
కెమెరాలకు చిక్కిన రోహిత్‌.. సీక్రెట్‌గా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement