India vs West Indies 5th T20I Predicted Playing XI, Check Names List Inside - Sakshi
Sakshi News home page

Ind Vs WI 5th T20I: వెస్టిండీస్‌తో ఐదో టీ20.. సూర్యకుమార్‌కు విశ్రాంతి! ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌!

Published Sun, Aug 7 2022 4:52 PM | Last Updated on Sun, Aug 7 2022 6:32 PM

India vs West Indies 5th T20I Predicted Playing XIs - Sakshi

శనివారం విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 59 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 3-1తో టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా అఖరి టీ20లో ఆదివారం విండీస్‌-భారత జట్లు ఫ్లోరిడా వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి విండీస్‌ పర్యటనను ముగించాలని భారత్‌ భావిస్తోంది.

మరోవైపు ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన కరీబియన్ జట్టు మరో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఐదో టీ20కు ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చి ఇషాన్‌ కిషన్‌ను తీసుకురావాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

మరో వైపు ఈ సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన స్పిన్నర్‌ కుల్ధీప్‌ యాదవ్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక విండీస్‌ జట్టులో కూడా మార్పులు చోటు చేసుకునే ఛాన్స్‌ ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన డార్క్స్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ ఒడియన్‌ స్మిత్‌ తుది జట్టలోకి రావడం ఖాయమనిపిస్తోంది.  
తుది జట్లు (అంచనా)
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, సంజు శాంసన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), దీపక్ హుడా, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్, కుల్ధీప్‌ యాదవ్‌, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్
వెస్టిండీస్‌
కైల్ మైర్స్‌, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (కెప్టెన్‌), రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, డెవాన్ థామస్ (వికెట్‌ కీపర్‌), జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెకాయ్
చదవండి: IND VS WI 4th T20: హిట్‌మ్యాన్‌ ఖాతాలో పలు రికార్డులు.. దిగ్గజాల సరసన చేరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement