
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు నిరాశ పరిచారు. పురుషుల 51 కేజీల విభాగంలో తొలి రౌండ్‌లో ‘బై’ దక్కించుకున్న అమిత్ పంఘాల్ మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 1–4తో పాట్రిక్ చిన్‌యెంబా (జాంబియా) చేతిలో ఓటమి చవిచూశాడు.
టోక్యో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే నిష్క్రమించిన అమిత్ ఈసారి కూడా అదే ప్రదర్శన పునరావృతం చేశాడు. మహిళల 57 కేజీల విభాగం తొలి రౌండ్‌లో జైస్మిన్ (భారత్) 0–5తో నెస్తీ పెటిసియో (ఫిలిప్పీన్స్) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment