
ఎయిమ్‌చెస్ ర్యాపిడ్ టోర్నమెంట్‌లో సంచలనం నమోదైంది. 19 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. ప్రపంచ ఛాంపియన్, నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను చిత్తుగా ఓడించాడు. ఈ పోరులో అర్జున్ 54 ఎత్తుల్లో కార్ల్‌సన్ ఆట కట్టించి, గత నెలలో జూలియ్ బేయర్ జనరేషన్ కప్ ఆన్‌లైన్ టోర్నీలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
కాగా, ఇటీవలి కాలంలో వరల్డ్ ఛాంపియన్ కార్ల్‌సన్.. భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో తరుచూ ఓడిపోతున్నాడు. నెల రోజుల వ్యవధిలో కార్ల్‌సన్ నాలుగు సార్లు భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో ఓడిపోయాడు. 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. మూడు సార్లు కార్ల్‌సన్‌పై విజయం సాధించగా.. తాజాగా అర్జున్ ఇరగైసి కార్ల్‌సన్‌కు చుక్కలు చూపించాడు.
Comments
Please login to add a commentAdd a comment