ఆసియాకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చారు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్. దీపక్ చాహర్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లు దూరమయ్యారు.
గత ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన బుమ్రా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇక ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇక పాకిస్తాన్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.
ఆసియా కప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, వై చాహల్, ఆర్ బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్ , అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్
చదవండి: Nepal Head Coach: నేపాల్ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్..
Comments
Please login to add a commentAdd a comment