ఏ మాత్రం అంచనాలు లేకుండా ఛాంపియన్స్ లీగ్ బరిలోకి దిగిన ఇంటర్ మిలన్.. 13 ఏళ్ల తర్వాత తొలిసారి లీగ్ ఫైనల్‌కు చేరింది. అండర్ డాగ్స్‌గా బరిలో దిగిన ఈ జట్టు.. సెమీస్‌లో ఏసీ మిలన్‌ను 3-0 తేడాతో (మొత్తంగా) ఓడించింది. సెకెండ్ లెగ్ (మ్యాచ్)లో సబ్‌స్టిట్యూట్ రొమేలు లుకాకు అందించిన పాస్‌ను వినియోగించుకున్న లౌటరో మార్టినెజ్ అద్భుతమైన గోల్‌తో తన జట్టుకు ఫైనల్‌కు చేర్చాడు.
అంతకుముందు ఇంటర్ మిలాన్ తొలి లెగ్‌లో 2-0 గోల్స్‌తో ఆధిక్యం సాధించింది. ఈ గెలుపుతో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు చేరిన ఇంటర్ మిలాన్.. వచ్చే నెల (జూన్ )10న ఇస్తాంబుల్‌లో జరిగే ఫైనల్లో రియల్ మాడ్రిడ్ లేదా మాంచెస్టర్ సిటీతో తలపడనుంది. నగర ప్రత్యర్థులతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో (సెమీస్) జట్టు ప్రదర్శించిన సమన్వయాన్ని ఇంటర్ మిలాన్ కెప్టెన్ మార్టినెజ్ ప్రశంసించాడు.
చదవండి: చరిత్ర తిరగరాసిన జకోవిచ్
Comments
Please login to add a commentAdd a comment