పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు ఫేలవ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల మ్యాచ్‌లో ఒక్కసారి కూడా బౌలింగ్‌కు అనుకూలించని పిచ్‌పై బ్యాట్స్‌మన్ పండగ చేసుకున్నారు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్స్ కూడా పాక్ బౌలర్లకు ధీటుగానే బదులిచ్చారు. ఒక రకంగా జీవం లేని పిచ్‌ను ఎలా తయారు చేయడం ఏంటని అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ -ఉల్-హక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
''రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టుపై విమర్శలు వస్తున్నాయి. ఈ పిచ్ ఏంటి అంటూ కొందరు అభిమానులు పేర్కొన్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలో నిజముంది. కనీసం వచ్చే టెస్టులో పనికిమాలిన పిచ్ తయారు చేయరని భావిస్తున్నా. టెస్టుల్లో ఇలాంటి ఫలితం ఎప్పుడు చూశానో నాకు సరిగా గుర్తులేదు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మొదటిరోజునే పిచ్ ఏంటనేది అర్థమైపోయింది. మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా కూడా పాక్‌కు ధీటుగా బదులిచ్చింది. మొదట పాక్ ఈ మ్యాచ్‌లో 100-150 పరుగుల లీడ్ సాధిస్తుందని అనుకున్నా. కానీ ఆసీస్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు.సాధారణంగా ఉపఖండపు పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయంటారు. కాబట్టి కనీసం వచ్చే టెస్టుకైనా స్పోర్టింగ్ పిచ్ తయారు చేస్తారని ఆశిస్తున్నా. స్పిన్నర్లకు సహకరించేలా వికెట్ తయారు చేయండి. దయచేసి డెడ్ పిచ్‌లను తయారు చేయకండి.'' అంటూ యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.
చదవండి: Prithvi Shaw: నా బ్యాటింగ్ చూస్తే అసహ్యమేస్తోంది: పృథ్వీ షా
ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన జడేజా.. నంబర్ 1
Comments
Please login to add a commentAdd a comment