ఐపీఎల్‌ 2021: బీసీసీఐ కీలక నిర్ణయం | IPL 2021: BCCI Takes Crucial Decision To Remove Soft Signal | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: బీసీసీఐ కీలక నిర్ణయం

Published Sun, Mar 28 2021 9:23 AM | Last Updated on Fri, Apr 2 2021 8:40 PM

IPL 2021: BCCI Takes Crucial Decision To Remove Soft Signal - Sakshi

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌‌కు సంబంధించి బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో సాఫ్ట్‌ సిగ్నల్‌ ఔట్‌ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో  ఫీల్డ్అంపైర్ సాప్ట్ సిగ్నల్‌ను ఐపీఎల్ 2021 సీజన్‌‌కి రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం అపెండిక్స్‌ డి- క్లాస్‌ 2.2.2.. ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది.

మ్యాచ్‌లో ఫీల్డర్ సందేహాస్పదంగా క్యాచ్ పట్టినప్పుడు.. ఫీల్డ్ అంపైర్ ఔట్‌పై తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌ని ఆశ్రయించేవాడు. ఆ సమయంలో తనవైపు నుంచి సాప్ట్ సిగ్నల్‌గా ఔట్ లేదా నాటౌట్‌ని అని ఫీల్డ్ అంపైర్ చెప్పేవాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ రిప్లైని పరిశీలించి.. స్పష్టమైన ఆధారాలు దొరకని సమయంలో.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడేవాడు. కొన్ని సందర్భాల్లో ఆధారాలు కనిపిస్తున్నా.. రిస్క్ తీసుకునేందుకు థర్డ్ అంపైర్ వెనుకంజ వేస్తున్నారు. దాంతో అంపైర్‌ నిర్ణయాలు వివాదాలుగా మారుతున్నాయి. ఐపీఎల్‌లో ఇలాంటి తప్పులు జరగకూడదనే సాప్ట్ సిగ్నల్ పద్ధతికి బీసీసీఐ స్వస్తి పలికింది. ఏప్రిల్‌ 9 నుంచి జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్‌లో థర్డ్ అంపైర్ ఔట్ లేదా నాటౌట్ నిర్ణయాన్ని.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో ప్రేమయం లేకుండా తీసుకోనున్నాడు.

టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో  సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ని ఫీల్డర్ డేవిడ్ మలాన్ డైవ్ చేస్తూ తీసుకున్నాడు. కానీ.. క్యాచ్ పట్టిన తర్వాత అతను పట్టిన బంతి గ్రౌండ్‌ను తాకినట్లు రిప్లైలో స్పష్టంగా కనిపించింది. అయితే.. ఫీల్డ్ అంపైర్ సాప్ట్ సిగ్నల్ ఔట్‌ ఇవ్వడం.. థర్డ్ అంపైర్ కూడా క్యాచ్‌పై క్లారిటీ లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే ఓటు వేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
చదవండి: 
‘బౌలర్లు బలైపోతున్నారు.. రూల్స్‌ మార్చండి’

గావస్కర్‌ ‌.. ఫోన్‌ ఆన్‌లో ఉంది.. ఇప్పుడు మాట్లాడుదాం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement