IPL 2021: Delhi Capitals Shreyas Iyer Dance To Vaathi Coming Song Gone Viral - Sakshi
Sakshi News home page

Viral Video Shreyas Iyer: 'వాతి కమింగ్‌' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన అయ్యర్‌..

Published Sat, Sep 11 2021 7:44 PM | Last Updated on Sun, Sep 12 2021 11:13 AM

IPL 2021: Delhi Capitals Shreyas Iyer Dance To Vaathi Coming Song Gone Viral - Sakshi

దుబాయ్‌: యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మలిదశ మ్యాచ్‌ల కోసం దాదాపు అన్నిజట్టు ఇదివరకే దుబాయ్‌ చేరుకున్నాయి. ఓ వైపు ప్రాక్టీస్‌.. మరోవైపు నైట్‌ పార్టీలతో ఆటగాళ్లంతా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ఓ ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసింది. అందులో ఆటగాళ్లు ఆటలు, పాటలతో సందడి చేశారు. రెండు బృందాలుగా విడిపోయి తెగ హడావుడి చేశారు. కొందరు దేశీయ స్టార్‌ ప్లేయర్లు హిందీ పాటలు పాడి అలరించగా, బాండింగ్ సెషన్‌లో ఆటగాళ్లంతా హుషారెక్కించే డాన్స్ స్టెప్పులతో ఇరగదీశారు.

ఇందులో అయ్యర్ ఓ పాపులర్‌ తమిళ్‌ పాటకు చేసిన డ్యాన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. తమిళ స్టార్‌ హీరో, ఇలయ దళపతి విజయ్‌ చిందేసిన 'వాతి కమింగ్‌' పాటకు అయ్యర్‌తో పాటు డీసీ జట్టు సభ్యులంతా స్టెప్పులతో హోరెత్తించాడు. ఈ పార్టీలో ఆటగాళ్లంతా మైమరచిపోయి చిందేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. మరిచిపోలేని రాత్రి అంటూ క్యాప్షన్‌ జోడించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

ఇదిలా ఉంటే, రిషబ్ పంత్‌ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్‌లలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టిన పంత్ ఆకట్టుకున్నాడు. దీంతో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి జట్టులోకి వచ్చినా.. కెప్టెన్సీ దక్కలేదు. మరోవైపు సీజన్‌ ఆరంభానికి ముందు డీసీకి భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్‌, ఇంగ్లండ్ ప్లేయర్ క్రిస్ వోక్స్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కాగా, డీసీ సెకెండ్‌ లెగ్‌ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 22న సన్‌రైజర్స్‌తో ఆడనుంది.
చదవండి: ఆ మూడు ఐపీఎల్‌ జట్లకు భారీ షాక్‌.. ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లు దూరం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement