ముంబై: ఐపీఎల్ 13వ సీజన్‌లో విండీస్ స్టార్ క్రిస్ గేల్ మొదటి అంచె పోటీలకు దూరమైనా.. రెండో అంచె పోటీల్లో మాత్రం అదరగొట్టాడు. 7 మ్యాచ్‌ల్లోనే 288 పరుగులతో దుమ్మురేపాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో గేల్‌పై మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ సారధి కేఎల్ రాహుల్ పవర్ హిట్టర్ గురించి ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.
''41 ఏళ్ల వయసులోనూ గేల్ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఇక గేల్‌తో కలిసి గతేడాది కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు పంచుకున్నా. అప్పుడే మరో ఏడాది వచ్చేసింది.. ఐపీఎల్ కొత్త సీజన్ కూడా వచ‍్చేసింది. గేల్ కూడా సంవత్సరాలు గడుస్తున్న కొద్ది మరింత రాటు దేలుతున్నాడు. ఇప్పటికే పంజాబ్‌తో కలిసిన అతను తన బ్యాటింగ్ పవర్‌ను మరోసారి చూపించాలని ఉవ్విళ్లురుతున్నాడు. అసలు గేల్ ఇంత ఫిట్‌నెస్ ఎలా సాధించాడనేది అర్థం కాలేదు. ఏకధాటిగా 3- 4 గంటలు పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా భారీ సిక్సర్లు కొట్టడం అతనికే సాధ్యమైంది. గేల్ ఫిట్‌నెస్‌లో నాకు సగమొచ్చినా బాగుండేది'' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.
ఇక పంజాబ్ కింగ్స్ గతేడాది సీజన్‌లో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగతంగా చూసుకుంటే మాత్రం కేఎల్ రాహుల్ దుమ్మురేపాడు. మొత్తం 14 మ్యాచ్‌లాడిన రాహుల్ ఒక సెంచరీ.. 5 హాఫ్ సెంచరీల సాయంతో 670 పరుగులు సాధించాడు. ఇక పంజాబ్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 12న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది.
చదవండి: ముందే ఊహించా.. నాకేం ఆశ్చర్యం వేయలేదు: మ్యాక్స్‌వెల్
Comments
Please login to add a commentAdd a comment