ముంబై: వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ సేవలను సరిగా వినియోగించుకోలేపోయారని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ రాజస్తాన్ రాయల్స్ తీరును విమర్శించాడు. అపార అనుభవం కలిగిన బట్లర్‌కు కీపింగ్ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించాడు. అదే విధంగా అతడిని మిడిల్ ఆర్డర్‌లో ఆడించడం పట్ల కూడా పెదవి విరిచాడు. కాగా ఐపీఎల్ -2021 సీజన్‌లో సోమవారం రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 4 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. తద్వారా విజయంతో బోణీ కొట్టింది.
ఇదిలా ఉండగా, అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీ(119) చేసి విజయానికి చేరవవుతున్న సమయంలో అవుట్ కావడంతో ఆర్‌ఆర్ కెప్టెన్ సంజూ సామ్సన్‌కు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘‘జోస్ బట్లర్ వంటి అద్భుతమైన అనుభవం గల ఆటగాడు ఉండగా, అతడిని ఎందుకు కీపర్ స్థానంలో తీసుకోలేదు. అంతేకాదు అతడితో ఎందుకు ఓపెనింగ్ చేయించలేదు!!!! అసలు మీరేం ఆలోచిస్తున్నారు’’ అంటూ రాజస్తాన్ జట్టు తీరుపై విమర్శలు గుప్పించాడు.
కాగా సోమవారం నాటి మ్యాచ్‌లో కెప్టెన్ సంజూ సామ్సన్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగగా, బెన్‌స్టోక్స్, మనన్ వోహ్రా ఓపెనింగ్ చేశారు. స్టోక్స్ పరుగులేమీ చేయకుండానే షమీ బౌలింగ్‌లో వెనుదిరగగా, వోహ్రా కేవలం 12 పరుగులు చేశాడు. ఇక జోస్ బట్లర్ 25 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక గత రెండు సీజన్లలో ఆర్‌ఆర్ తరఫున ఓపెనింగ్ చేసిన బట్లర్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. ఇక ఇంగ్లండ్ తరఫున అతడు టీ20ల్లో ఓపెనింగ్ చేస్తాడన్న సంగతి తెలిసిందే.
Having @josbuttler behind the stumps for his tactical experience is crucial ... Why isn’t he keeping @rajasthanroyals !???? #IPL2021
— Michael Vaughan (@MichaelVaughan) April 12, 2021
And now @josbuttler doesn’t Open !!!!!!!!!! What are you thinking @rajasthanroyals !!!!! #IPL
— Michael Vaughan (@MichaelVaughan) April 12, 2021
Comments
Please login to add a commentAdd a comment