పంజాబ్ కింగ్స్:
కెప్టెన్: కేఎల్ రాహుల్
ఉత్తమ ప్రదర్శన: 2014 ఐపీఎల్ రన్నరప్
కేఎల్ రాహుల్ సారధ్యంలోని పంజాబ్ కింగ్స్ గతేడాది సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 13వ సీజన్‌లో కేఎల్ రాహుల్ దుమ్మురేపే ప్రదర్శనతో లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచినా అతనికి అండగా నిలిచేవారు కరువయ్యారు. మయాంక్ మెరుపులు తొలి అంచె మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కాగా.. క్రిస్ గేల్‌కు అవకాశాలు ఇవ్వకపోవడం.. ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్‌వెల్ ఘోరంగా విఫలం కావడం ఆ జట్టును దెబ్బతీసింది.
దీంతో ఈసారి వేలానికి జట్టులో చాలా మంది ఆటగాళ్లను రిలీజ్ చేసిన పంజాబ్ జట్టు వేలంలో జై రిచర్డసన్‌కు రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అందరిని ఆశ్యర్యపరిచింది. పంజాబ్ కింగ్స్ తాను ఆడనున్న 14 లీగ్ మ్యాచ్‌ల్లో.. 5 మ్యాచ్‌లు బెంగళూరు.. 4మ్యాచ్‌లు అహ్మదాబాద్.. 3 మ్యాచ్‌లు ముంబై.. 2 మ్యాచ్‌లు చెన్నై వేదికగా ఆడనుంది.
చదవండి: సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి
పంజాబ్ కింగ్స్ జట్టు:
బ్యాట్స్‌మెన్: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్‌కీపర్),మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ప్రబ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మలాన్, షారుఖ్ ఖాన్
ఆల్‌రౌండర్లు: దీపక్ హుడా,మొయిసెస్ హెన్రిక్స్, ఫాబియన్ అలెన్,ఉత్కర్ష్ సింగ్, మన్‌దీప్ సింగ్, జలజ్ సక్సేనా
బౌలర్లు: మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, దర్శన్ నల్కండే, జై రిచర్డ్సన్, రిలే మెరెడిత్, జలజ్ సక్సేనా, సౌరభ్ కుమార్ , ఇషాన్ పోరెల్, క్రిస్ జోర్డాన్
పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లు
తేది | జట్లు | వేదిక | సమయం |
ఏప్రిల్ 12 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 16 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ సీఎస్‌కే | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 18 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 21 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ | చెన్నై | సాయంత్రం 3.30 గంటలు |
ఏప్రిల్ 23 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ | చెన్నై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 26 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ | అహ్మదాబాద్ | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 30 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్‌సీబీ | అహ్మదాబాద్ | రాత్రి 7.30 గంటలు |
మే 2 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ | అహ్మదాబాద్ | రాత్రి 7.30 గంటలు |
మే 6 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్‌సీబీ | అహ్మదాబాద్ | రాత్రి 7.30 గంటలు |
మే 9 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ సీఎస్‌కే | బెంగళూరు | సాయంత్రం 3.30 గంటలు |
మే 13 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ | బెంగళూరు | సాయంత్రం 3.30 గంటలు |
మే 15 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ | బెంగళూరు | రాత్రి 7.30 గంటలు |
మే 19 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ | బెంగళూరు | రాత్రి 7.30 గంటలు |
మే 22 | పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ | బెంగళూరు | సాయంత్రం 3.30 గంటలు |
Comments
Please login to add a commentAdd a comment