ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ ఎప్పుడెప్పుడు బరిలోకి దిగాల అని ఎదురుచూస్తున్నాడు. అసలే దూకుడుకు మారుపేరుగా నిలిచిన పంత్‌కు ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు అదనంగా వచ్చి చేరాయి. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న చెన్నై వేదికగా సీఎస్‌కేతో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రాక్టీస్ అనంతరం రిషబ్ పంత్ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
''ముందుగా కెప్టెన్సీ బాధ్యతలతో చాలా ఉత్సాహంగా ఉన్నా.. ఒక కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే మహీ బాయ్ కెప్టెన్‌గా ఉన్న సీఎస్‌కేను ఎదుర్కొంటున్నా. నా జీవితంలో ధోని బాయ్‌కి ప్రత్యేకస్థానం ఉంది. అతని ఆటను చూస్తూ పెరిగిన నాకు ఈరోజు అతని ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌గా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. ధోని ఆట నుంచి ఎన్నో మెళుకువలు నేర్చుకున్న నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ధోని లాంటి వ్యక్తి ఆడేందుకు ఏ ఆటగాడైనా సిద్ధంగా ఉంటాడు.. ఇప్పుడు నేను దానికోసం ఎదురుచూస్తున్నా.
ఇక కెప్టెన్‌గా ఢిల్లీకి టైటిల్ అందిస్తానో లేదో తెలియదు కానీ.. ఒక మంచి కెప్టెన్‌గా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తా. నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్ గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుంది. జట్టులో ఉండే ప్రతీ ఆటగాడు వంద శాతం తన ఆటకు న్యాయం చేయాలనే చూస్తాడు. అలా చూసుకుంటే మాత్రం జట్టుగా మేం బలంగా ఉన్నట్లు నమ్ముతున్నా. జట్టులో ఆహ్లదకర వాతావరణం ఉంటే మ్యాచ్ ఫలితాలు అనుకూలంగా వస్తాయి. అయ్యర్ లేని లోటు తీర్చడం కష్టం.. కానీ అతన్ని మరిపించే విధంగా జట్టు రాణించాలని కోరుకుంటున్నానంటూ'' చెప్పుకొచ్చాడు. చదవండి : పంత్ ఆన్ ఫైర్.. ప్రత్యర్థులకు చుక్కలే
జెర్సీలో కలర్‌ఫుల్‌గా ఉన్నావు.. మరి టైటిల్ సంగతేంటి!
📹 | @RishabhPant17 brought a lot of positive energy to his first interview as captain 🤩
— Delhi Capitals (@DelhiCapitals) April 6, 2021
P.S. #RP17 is all set for the first game against mentor and friend, @msdhoni 💙💛#YehHaiNayiDilli #DCAllAccess @OctaFX pic.twitter.com/D3zrquEf1C
Comments
Please login to add a commentAdd a comment