
Photo Courtesy: Twitter
ఢిల్లీ: ముంబై ఇండియన్స్-సీఎస్‌కే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్‌కు మంచి మజాను తీసుకొచ్చింది. బౌండరీల వర్షంతో తడిసిన ఢిల్లీ గ్రౌండ్‌లో చివరకు విజయం ముంబైను వరించింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. పొలార్డ్ (87 నాటౌట్, 34 బంతులు; 6 ఫోర్లు, 8 సిక్సర్లతో) విద్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
కాగా, మ్యాచ్ తర్వాత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ-సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనిలు మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. ఇద్దరూ కలిసి సరదాగా ముచ్చటించుకుంటూ గేమ్‌లోని విశేషాలను పంచుకున్నారు. మ్యాచ్‌లో ఎంత ప్రత్యర్థులుగా తలపడినా ఆఫ్ ఫీల్డ్‌లో మాత్రం ధోని-రోహిత్‌లు ఇలా కనబడటం ఫ్యాన్స్‌కు కనువిందు చేసింది. ఇది కదా గేమ్ స్పిరిట్ అంటూ అభిమానులు తెగముచ్చపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ చేయగా... మొయిన్ అలీ (36 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఫాఫ్ డు ప్లెసిస్ (28 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. డు ప్లెసిస్‌కు ఐపీఎల్‌లో ఇది వరుసగా నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలించింది.
— Kamlesh Sharma (@meKamlesh45) May 1, 2021
Comments
Please login to add a commentAdd a comment