Photo Courtesy:IANS
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుసగా రెండు ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబై ఇండియన్స్‌తో ఈరోజు చెపాక్‌లో జరుగనున్న మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. ఒకవైపు ముంబై ఇండియన్స్ అత్యంత బలంగా ఉండటంతో ఆ జట్టును ఎలా నిలువరించాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ.. గత మ్యాచ్‌ల ఓటములను పక్కను పెట్టే ఫ్రెష్‌గా బరిలోకి దిగాలనుకుంటోంది. సన్‌రైజర్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేన్ విలియమ్సన్ లేకపోవడంపై ఆ జట్టుపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. కేన్ మామ లేని కారణంగానే రెండు మ్యాచ్‌లు ఓడిపోయామని అభిమానులు సదరు ఫ్రాంచైజీపై విమర్శలకు దిగారు.
కానీ విలియమ్సన్ ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడని, అందుచేత అతన్ని జట్టులో వేసుకోలేదని ఫ్రాంచైజీ సైతం వివరణ ఇచ్చింది. కాగా, విలియమ్సన్ ఇంకా ఫిట్ కాలేదట. ముంబైతో మ్యాచ్‌కు కూడా విలియమ్సన్ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని కేన్ విలియమ్సన్ తన మాటల ద్వారా స్పష్టం చేసిన ఒక వీడియోను విడుదల చేసింది సన్‌రైజర్స్. 'గాయం నయమవుతోంది. వారం రోజుల్లో పూర్తి ఫిట్‌నెస్ సాధించి బరిలోకి దిగుతా. ప్రాక్టీస్‌కు బ్యాలెన్స్ పాటిస్తున్నా. అతి తర్వలోనే పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో సిద్ధమవుతా’ అని తెలిపాడు.
ఇక్కడ చదవండి: పాటలు పాడుతూనే ‘వీర’బాదుడు!
నన్ను చంపాలనే ప్రోగ్రామ్ పెట్టారా..?: రోహిత్
Kane Williamson gives us an update on his recovery.#OrangeOrNothing #OrangeArmy #IPL2021 pic.twitter.com/BP77O28Akk
— SunRisers Hyderabad (@SunRisers) April 16, 2021
Comments
Please login to add a commentAdd a comment