ముంబై: రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ ఐపీఎల్ 14వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 25 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ కెప్టెన్ సంజూ సామ్సన్ వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్నా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ సంగతి పక్కనపెడితే.. రియన్ పరాగ్ తనకు, ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి మధ్య గతేడాది సీజన్‌లో జరిగిన సంభాషణ గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.
''రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్‌లో నాది ఐదు లేదా ఆరవ స్థానం. సహజంగా ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే జట్టుకు అవసరమైన పరుగుల కోసం ఆడాల్సి వస్తుంది తప్ప భారీ స్కోర్లు చేసే అవకాశం ఉండదు. ఇదే విషయంపై కోహ్లితో చాట్ సందర్భంగా తనదైన శైలిలో కామెంట్ చేశాడు. అరె.. రియాన్.. నువ్వు బ్యాటింగ్‌కు వచ్చేది ఐదు లేదా ఆరో స్థానంలో.. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే ఆరెంజ్ క్యాప్ అందుకోవడం కష్టం. ఆ సమయంలో నీ తరపు నుంచి జట్టుకు 20- 30 పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టాలి. అందుకే ఆరెంజ్ క్యాప్ గురించి మర్చిపో అని చెప్పాడు. అప్పటినుంచి నా ఆలోచన దృష్టిని మార్చుకొని మ్యాచ్‌కు అనుగుణంగా పరుగులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రాజస్తాన్ రాయల్స్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కొనుంది.
చదవండి: ఒత్తిడిలో ఎలా ఆడాలో పాండేకు తెలియడం లేదు
Comments
Please login to add a commentAdd a comment