
ఢిల్లీ: ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఇంకా తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేదు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థికి చుక్కలు చూపించే రోహిత్ ఈ సీజన్‌లో మంచి ఆరంభమే ఇస్తున్నా దానిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ వైఫల్యంపై టీమిండియా మాజీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
''రోహిత్ తన సాధారణ శైలిలో కాకుండా విభిన్నంగా ఆడుతున్నాడు. అందుకే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తన సాధారణ శైలిలో ఆడితే రోహిత్ సులభంగా 70-80 పరుగులు చేయగలడు. రోహిత్ ఫామ్‌లోకి వస్తే ముంబై టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఐపీఎల్ అత్యుత్తమ బౌలర్లలో అమిత్ మిశ్రా ఒకడు. మిశ్రాతో కలిసి నేను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడా. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ అందరితో కలిసి పోతుంటాడు. తన లెగ్‌స్పిన్ మ్యాజిక్‌తో ఈసారి ఢిల్లీకి కీలకంగా మారనున్నాడు'' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
కాగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ముంబై తన తర్వాతి మ్యాచ్‌ను రేపు(ఏప్రిల్ 23)నపంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment