IPL 2021 2nd Phase: ఐదేళ్ల తర్వాత మళ్లీ డకౌట్‌.. | Ipl 2021:First Time since April 2016 Warner Has Been dismissed For a duck in IPL | Sakshi
Sakshi News home page

SRH Vs DC: ఐదేళ్ల తర్వాత మళ్లీ డకౌట్‌..

Published Wed, Sep 22 2021 8:00 PM | Last Updated on Wed, Sep 22 2021 8:07 PM

Ipl 2021:First Time since April 2016 Warner Has Been dismissed For a duck in IPL - Sakshi

David Warner Duck Out IPL.. దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అభిమానులను నిరాశపరిచాడు.  తొలి ఓవర్‌ మూడో బంతికే  డేవిడ్‌ వార్నర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. నోర్ట్జే బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో డేవిడ్‌ వార్నర్‌ పేరిట ఒక రికార్డు నమోదైంది. అదేంటంటే.. వార్నర్‌ ఐపీఎల్‌లో డకౌట్‌ అవ్వడం ఇది రెండో సారి మాత్రమే. 2016 తర్వాత మళ్లీ ఇప్పుడు మాత్రమే డకౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. విలియమ్సన్‌ 9, మనీష్‌ పాండే 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

చదవండి: IPL 2021 2nd Phase SRH Vs DC: డేవిడ్‌ వార్నర్‌ డకౌట్‌.. తొలి వికెట్‌ డౌన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement